వెబ్ సైట్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్

By Srikanya

హైదరాబాద్ : నందమూరి కళ్యాణ్ రాజ్ రీసెంట్ గా ఓ వెబ్ సైట్ పై ఎసిపి-సైబర్ క్రైమ్ కు తమ ప్రొడక్షన్ హౌస్ తరుపున కంప్లైంట్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. తమ పాటలు ఇంటర్ నెట్ లో ఓ వెబ్ సైట్ లీక్ చేయటంతో ఆయన ఈ యాక్షన్ తీసుకున్నారని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... కళ్యాణ్ రామ్ తాజా చిత్రం 'ఓమ్'. ఈ చిత్రంలో పాటలు మే 25న విడుదల కానునన్నాయి. ఈ లోగా పాటలు ఓ వెబ్ సైట్ వాళ్లు సంపాదించి తమ సైట్ లో పెట్టేసారు. దాంతో వెంటనే కళ్యాణ్ రామ్ ఎసిపి-సౌబర్ క్రైమ్ ని సంప్రదించి యాక్షన్ తీసుకున్నారు. వారు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోగానే...ఆ వెబ్ సైట్ ని మూసేసారు. అయితే ఏ వెబ్ సైట్...అనేది తెలియరాలేదు.

ఆ చిత్రంలో పాటల ప్రోమోను అఫీషియల్ గా ఆయన విడుదల చేసారు. యూ ట్యూబ్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ ఛానెల్ లో ఈ పాటల ప్రోమో దొరుకుతాయి. ఈ ప్రోమో తో పాటలుకు మంచి క్రేజ్ వచ్చింది. చిత్రాన్ని జూన్ 5 న విడుదల చేస్తున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంత కాలం నుంచి త్రీడి చిత్రం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై త్రీడీ స్టీరియోఫోనిక్‌ విధానంలో 'ఓం' చిత్రాన్ని తానే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు . ఛాయాగ్రాహకుడు సునీల్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్ . షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని రీసెంట్ గా విడుదల చేసారు.

ఈ చిత్రంలో కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్‌, స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X