కళ్యాణ్ రామ్ తాజా చిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

By Srikanya

కళ్యాణ్ రామ్, అభిమన్యు మల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సెప్టెంబర్ 9న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రెడీ అవుతున్న ఈ చిత్రం పది శాతం మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం ద్వారా సనా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆమె ఇంతకుముందు ఓ తమిళ చిత్రం చేసింది. ఇక విలేజ్ లో వినాయకుడు చిత్రంలో చేసిన శరణ్యా మోహన్..కళ్యాణ్ రామ్ చెల్లిగా కీరోల్ చేస్తోంది. రవితేజ కిక్ లో పోలీస్ ఆఫీసర్ గా చేసిన శ్యామ్ మరో కీలకపాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం అందించే ఈ చిత్రం తనకు మరో సూపర్ హిట్ ని అందిస్తుందని కళ్యాణ్ రామ్ నమ్మకంగా ఉన్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం కళ్యాణ్ రామ్..యేలేటి చంద్ర శేఖర్ దర్సకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. బాలకృష్ణతో 'సింహా' వంటి సూపర్ హిట్ ఇచ్చిన నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X