'హరేరామ్' రిలీజై ఏడు నెలలైనా నందమూరి కళ్యాణ్ రామ్ ఏ సినిమా స్టార్ట్ కాలేదు. ఆయనేం చేస్తున్నారని అభిమానులకు సందేహం కలగటం సహజం. అయితే కళ్యాణ్ రామ్ నరేన్ అనే క్రొత్త దర్శకుడుతో ఆయన సినిమా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. పిభ్రవరి ఐదు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అందునిమిత్తం హీరోయిన్ కోసం దర్శకుడుతో కలిసి ఆయన ముంబయి వెళ్తారని తెలుస్తోంది. మొదట ఈ సినిమాకు హన్సికను అనుకున్నారు. అయితే ఆమె రేటు మరీ ఎక్కువ చెప్పటంతో మరో కొత్త హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
Story first published: Monday, January 19, 2009, 17:51 [IST]