కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా ఎవరితోనంటే...
కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం దర్శకుడుగా మల్లిని ఎంపిక చేసుకున్నారు. గతంలో కళ్యాణ్ తో అభిమన్యు అనే చిత్రాన్ని రూపొందించిన మల్లి..వక్కంతం వంశి అందించిన కథతో ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక కళ్యాణ్ రామ్ తాజా చిత్రం జయీభవ బిలో యావరేజి రేంజిలో ఉండటంతో ఆ ప్రమోషన్ పై దృష్టి పెట్టారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక జయీభవ కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ..ఇదివరకు మా బ్యానర్‌లో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేశా. టైప్‌క్యాస్ట్ కూకూడదనీ, డిఫరెంట్‌గా చేద్దామనీ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేశా. ఓవర్ ఎక్స్‌పోజింగ్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఈ సినిమాని డిజైన్ చేశాం. కళ్యాణ్‌రామ్ అంటే యాక్షన్ ఉంటుందని ఆశిస్తారు. ఇది యాక్షన్ సినిమా కానందువల్ల బాగుందనే టాక్ విస్తరించడానికి కొంత టైమ్ పడుతుంది. అయినా ఈ సినిమా మా లక్ష్యాన్ని సాధించామనే అనుకుంటున్నా. ఓపెనింగ్స్ ఆశించిన రీతిలోనే ఉన్నాయి అన్నారు. అతనొక్కడే తర్వాత సరైన విజయం అందుకోని కళ్యాణ్ రామ్..ప్రారంభం కాబోయే ఈ కొత్త చిత్రంతోనైనా హిట్ కొట్టాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











