రాజకీయాలపై ఆసక్తి లేదు: నందమూరి హీరో స్పష్టీకరణ
హైదరాబాద్: రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ స్పష్టం చేసారు. తాను ఎప్పటికీ అలు వైపు వెళ్లబోనని కళ్యాణ్ రామ్ తేల్చి చెప్పారు. మీడియాలో తన గురించి రాజకీయ పరమైన వార్తలు వస్తున్నాయని, తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు.
కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్' మూవీ ఆయనకు హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా ఆయనలో కాన్ఫిడెన్స్ ఫెంచింది. ప్రస్తుతం రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్-2' చిత్రాన్ని నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ మంచి కథ దొరికితే బాలయ్య బాబాయ్ 100వ సినిమా తానే నిర్మిస్తానని అంటున్నారు. మంచి కథ దొరికితే తమ్ముడు తారక్ తో కూడా సినిమా చేస్తానని చెప్పారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ...‘హిట్' అనే మాట కోసం దాదాపు పదేళ్ల నుండి నిరీక్షించాను. మధ్యలో ‘హరే రామ్' సినిమా బాగా ఆడినా ‘పటాస్' అంత సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. మధ్యలో నాకు సినిమా తప్ప మరేం తెలియదు. అందుకే ఈ రంగాన్నే నమ్ముకుని ముందుకు సాగుతున్నాను అని తెలిపారు.

కలిసి ఉంటే కలదు సుఖం అనే మాటను నమ్ముతాను. అందరూ కలిసి ఓ కుటుంబంగా ఉంటే ఉండే బలమే వేర. అన్నయ్య జానకిరామ్ మరణం మా కుటుంబం పెద్ద అండ కోల్పోయింది. అన్నయ్యకు పటాస్ హిట్టవుతుందని బలమైన నమ్మకం ఉండేది. ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన రోజు సినిమా బావుంటుంది, హిట్టవుతుందని చెప్పారు. ఈ విజయాన్ని ఆస్వాదించడానికి ఆయన లేక పోవడం చాలా బాధగా ఉంది అన్నారు.
పటాస్ మూవీ గురించిన ఇతర వివరాల్లోకి వెళితే...
కళ్యాణ్ రామ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పటాస్' మూవీ కలెక్షన్ పరంగా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నటించిన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు ఈచిత్రం శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఓ లీడింగ్ ఛానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. కళ్యాణ్ రామ్ సినిమాకు ఇంత రావడం అంటే షాకే మరి.


Click it and Unblock the Notifications











