ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన నటించటం లేదు: అదంతా అబద్దమేనట, అదంతా గాసిప్ రాయుళ్ళ పనే

సినిమాలు ఎనౌన్స్ చేసిన దగ్గరినుంచీ ఇక రకరకాల ఊహాగానాలూ, గాసిప్పులూ మొదలయ్యాయి. ఏ పాత్రలో ఎవరెవరూ అంటూ వచ్చిన వార్తల్లో సగానికి సగం ఉత్తుత్తివే, నిన్న వచ్చిన యూస్ కూడా గాసిప్ మాత్రమే అని తేలింది.

ఎన్టీఆర్ బయో పిక్ ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ హాట్ టాపిక్ అయ్యింది. కేవలం సినిమా ఇందస్ట్రీ వరకే ఈ సినిమాలు పరిమితం కాదు, ఆయన జీవితం పై రాబోతున్న సినిమాలన్నిటి దృస్తీ రాజకీయాల మీదనే అన్నది నిర్వివాదాంశమే. ఒక పక్క రామ్‌గోపాల్ వర్మ తాను తీయబోతున్న సినిమా ప్రస్తుత తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రీ అయిన చంద్రబాబు మీదకి ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రం అని ఇండైరెక్ట్ హింట్ ఇచ్చేసాడు.

Recommended Video

Lakshmi’s NTR: Naked and Exposed Biopic, RGV Confirms
 ఎన్టీఆర్ విజయాలవరకే

ఎన్టీఆర్ విజయాలవరకే

ఇక తేజా తీయబోతున్న సినిమా కేవలం ఎన్టీఆర్ విజయాలవరకే అనీ నాదెండ్ల తిరుగు బాటు ఘటన తర్వార రెండోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావటంతో ముగుస్తుందనీ వార్తలు వస్తున్నాయి. తేజా ఎన్టీఆర్ లో బాలకృష్ణ హీరోగా (తండ్రి పాత్ర అయిన ఎన్టీఆర్ గా) చేస్తున్న సంగతి తెలిసిందే.

 రకరకాల ఊహాగానాలూ, గాసిప్పులూ

రకరకాల ఊహాగానాలూ, గాసిప్పులూ

అయితే ఈ సినిమాలు ఎనౌన్స్ చేసిన దగ్గరినుంచీ ఇక రకరకాల ఊహాగానాలూ, గాసిప్పులూ మొదలయ్యాయి. వర్మ చేస్తున్న లక్ష్మీ'స్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్ర చేయబోయేది గడ్డం చక్రవర్తీ అనీ అదే తేజా తీస్తున్న బయోపిక్ తెరమీద జగపతి బాబు ఆపాత్ర చేస్తున్నారనీ వచ్చిన వార్తలు ఇప్పటివరకూ అసలు నిజమో కాదో అర్థం కాకముందే కాస్త షాకింగ్ అనిపించే విషయం చక్కర్లు కొట్టింది.

 కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

ఏకంగా కళ్యాణ్ రామ్ తన తండ్రి అయిన హరికృష్ణ పాత్ర చేయటానికి ఒప్పుకున్నాడనీ దాదాపుగా ఆ విషయం కన్ ఫార్మ్ అయిపోయిందనీ వార్తలు వచ్చాయి.... అయితే అదంతా ఉత్తుత్తిన్యూసేనట. అసలు కళ్యాణ్ రామ్ ని ఎవ్వరూ సంప్రదించలేదనీ, అసలు ఎవరైనా అడిగినా ఆయన ఆ రోల్ లో నటించే అవకాశం ఉండక పోవచ్చనీ చెప్తున్నారు...

చైతన్య రథాన్ని డ్రైవ్ చేసింది హరికృష్ణ

చైతన్య రథాన్ని డ్రైవ్ చేసింది హరికృష్ణ

గతం లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు చైతన్య రథంపై రాష్ట్రం అంతా పర్యటించారు. అప్పుడు ఆ చైతన్య రథాన్ని డ్రైవ్ చేసింది ఆయన కొడుకు హరికృష్ణనే. ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ క్యారెక్టర్ కోసం కళ్యాణ్ రామ్ ను అడిగారని, ఓకె అన్నాడని గ్యాసిప్ బయటకు వచ్చింది. అయితే అస్సలు అలాంటి ప్రతిపాదన ఏదీరాలేదని కళ్యాణ్ రామ్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

 అంతా నమ్మేసారు

అంతా నమ్మేసారు

ప్రస్తుతానికి బాలయ్యకు, హరికృష్ణకు మధ్య బాంధవ్యాలు వున్నమాట వాస్తవమే కానీ, అంతగొప్ప సంబంధాలు ఏవీలేవన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎన్ని గొడవలు ఉన్న ఎన్టీఆర్ అనే మాట నందమూరి కుటుంబాన్ని కలిపే ఉంచుతుందీ అన్నది అందరూ కొంతయినా నమ్ముతున్న మాట దానివల్లే కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చేస్తున్నాడు అనగానే అంతా నమ్మేసారు. అసలు ఈ రెండు సినిమాలూ బయటికొచ్చే నాటికి ఇంకెన్ని రూమర్లు రానున్నాయో...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X