కళ్యాణ్ రామ్ ‘ఓం’ ఫస్ట్ లుక్ ఇదే...
ఈ చిత్రంలో కళ్యాణ్ సరసన నికీషా పటేల్, కృతి కర్భంధ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమాకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందించే పనిలో ఉన్నామని ఆయన చెప్తున్నారు. ఇక సునీల్ రెడ్డి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రసూల్ ఎల్లోర్ శిష్యుడు. ఆయన వద్ద భగీరధ, ఒకరికి ఒకరు చిత్రాలకు పనిచేసారు. ఆయన మంచు మనోజ్ తో చేసిన నేను మీకు తెలుసా చిత్రం బాగా పేరు తెచ్చుకుంది.
నందమూరి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు, సాంకేతిక విభాగానికీ ప్రాధాన్యం ఇస్తూ 'ఓం' చిత్రాన్నినిర్మాస్తున్నారు. ఇంతకు ముందు తన భ్యానర్ లో కళ్యాణ్ రామ్ అతనొక్కడే, హరేరామ్, జయీభవ చిత్రాలు నిర్మించారు. కత్తి చిత్రం ప్లాపు కావడంతో.... ఈ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications












