ఎన్టీఆర్ బయోపిక్‌లో నందమూరి హీరో.. ఎవరి పాత్ర కోసం అంటే!
Recommended Video

బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి క్రమంగా విశేషాలు బయట పడుతున్నాయి. బాలయ్య చిత్రాలలో మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కుతుండటం ఓ కారణం కాగా, ఈ చిత్రం కోసం బాలయ్య, దర్శకుడు క్రిష్ ఎంపిక చేసుకుంటున్న నటీ నటులు మరో కారణం అని చెప్పొచ్చు. తాజాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది.

పెద్ద కొడుకు
ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్న సమయంలో ఆయన పెద్ద కుమారుడు హరికృష్ణ కూడా పాలిటిక్స్ లో క్రియాశీలకంగా ఉన్నారు. అప్పటి తెలుగు దేశం పార్టీలో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ క్రియాశీలకంగా ఉన్నారు.

సినిమాలతో
ఎన్టీఆర్ మరణించాక, టిడిపి భాద్యతలు చంద్రబాబు తీసుకున్నాక హరికృష్ణ సినిమాల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన తనయులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎదుగుదలని ఆస్వాదిస్తున్నారు.

హరికృష్ణ పాత్ర
ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్ర చాలా కీలకం కానుంది. ఈ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ఎంపికైనట్లు తాజగా వార్తలు వస్తున్నాయి. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ సరిపోతాడని బాలయ్య, క్రిష్ ధీమాతో ఉన్నారట.

ఉత్కంఠ పెంచేస్తూ
ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఒక్కో విశేషం బయటకు వస్తూ అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తన తండ్రి పాత్రలో బాలయ్య ఎలా నటిస్తాడు.. ఎన్టీఆర్ జీవితంలో ఏ ఏ అంశాలు ఈ చిత్రంలో చూపిస్తారు అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొని ఉంది.

స్టార్స్‌తో సందడి
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో తెరపై నిండుగా స్టార్స్ కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య, చంద్రబాబుగా రానా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనుండడం విశేషం.


Click it and Unblock the Notifications











