ఫుట్ భాల్ ప్లేయర్ గా కళ్యాణ్ రామ్
కళ్యాణ్ రామ్ తాజా చిత్రం "కళ్యాణ్ రామ్ కత్తి" లో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించి తన అబిమానులను అలరించనున్నారు. ఈ చిత్రం నవంబర్ 12వ తేదీన విడుద కానుంది. ఇప్పటికే మణిశర్మ అందించిన ఆడియో మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సనాఖాన్ అనే కొత్తమ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. శరణ్యా మోహన్ ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి చెల్లి పాత్రలో కనిపించనుంది. అలాగే కిక్ చిత్రంతో పరిచయమైన తమిళ హీరో శ్యామ్..కళ్యాణ్ రామ్ కి బావగా కీలకమైన పాత్రలో కనిపిస్తారు. జయీభవ చిత్రం విడుదలైన ఒక సంవత్సరం అనంతరం తమ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మించిన ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రం దర్శకుడు మల్లి గతంలో కళ్యాణ్ రామ్ తో అభిమన్యు అనే చిత్రం రూపొందించారు.
కళ్యాణ్ రామ్ కత్తి మల్లి అతనొక్కడే హరేరామ్ జయీభవ సనా ఖాన్ kalyan ram katti khaleja danayya trivikram malli hare ram


Click it and Unblock the Notifications