మెగా మల్టీస్టారర్ కి ధీటుగా నందమూరి మల్టీస్టారెర్..!?
మల్టీస్టారర్ చిత్రాలు కరువైన నేటి తరంలో అల్లు అర్జున్-రామ్ చరణ్ కలయికలో పైడిపల్లి వంశీ ఓ ప్రాజెక్ట్ మొదలెడుతన్నాడన్న వార్తకు ధీటుగా నందమూరి క్యాంప్ లోనూ కసరత్తులు మొదలయ్యాయి. మొన్నటి జూ ఎన్టీఆర్ వివాహంతో తమ్ముడికి బాగా దగ్గరైన కళ్యాణ్ రామ్ ఈ ప్లాన్ కు మూల సూత్రధారి. ఈ ప్లాన్ పేరే నందమూరి మల్టీస్టారర్..
బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్, నాన్న హరికృష్ణతో పాటుగా తనకు ఓ క్యారక్టర్ వుండే కథ ఒకటి ఓకే చేసాడు కళ్యాణ్ రామ్. తాతయ్య ఎన్టీఆర్ చిత్రాల్లోని ఓ సూపర్ కథే ఈ చిత్రానికి మూలం. అన్నీ సవ్యంగా సాగితే రానున్న కొద్ది వారాల్లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఒక సూపర్ సక్సెస్ ఫుల్ దర్శకుడు ఈ చిత్ర బాధ్యతల్ని భుజాలకెత్తుకోనున్నాడట. నందమూరి, మెగా క్యాంప్ ల మధ్యనున్న పోటీతత్త్వమే ఇప్పుడు మల్టీస్టార్లకు కొత్త ఊపిరిపోయనుంది..
balakrishna jr ntr harikrishna kalyan ram allu arjun dil raju బాలకృష్ణ జూ ఎన్టీఆర్ హరికృష్ణ కళ్యాణ్ రామ్ అల్లు అర్జున్


Click it and Unblock the Notifications