»   » రవితేజ-కళ్యాణ్ రామ్-సురేందర్ రెడ్డి మూవీ డేటేల్స్

రవితేజ-కళ్యాణ్ రామ్-సురేందర్ రెడ్డి మూవీ డేటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఓ సినిమా నిర్మించ బోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మే 28న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా మూవీ ఎనౌన్స్ మెంట్ చేసారు. ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి 'కిక్-2' అని పిలుస్తున్నారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ...'తాతగారి పేరు మీద స్థాపించిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బేనర్లో తాతగారి జయంతి సందర్భంగా మరో క్రేజీయస్ట్ మూవీని ఎనౌన్స్ చేస్తున్నాం. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా మా 'అతనొక్కడే' దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ చిత్రం ప్రారంభిస్తున్నాం. రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'కిక్' చాలా డిఫరెంటుగా ఉంటుంది. అయితే ఇది కిక్ సీక్వెల్ కాను' అని తెలిపారు.

Kalyan Ram to produce Ravi Teja's next film

త్వరలో ఈ చిత్రం టైటిల్, మిగిలిన వివరాల్ని తెలియజేస్తాం. జూన్, జూలై నెలలో షూటింగ్ ముహూర్తం జరుపుకునే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుండి ఉంటుంది. నందూమరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్‍‌కి ఇది ఓ ప్రతిష్టాత్మక చిత్రం అవుతుందని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.

మనోజ్ పరమహంస కొలీగ్ అభినందన్ ఛాయాగ్రహణాన్ని నిర్వహించే ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత: నందమూరి జానకిరామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి. 'రేసు గుర్రం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే చిత్రం ఇదే. అలాగే 'బలుపు'తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ 'పవర్' తర్వాత చెయ్యబోయే సినిమా కూడా ఇదే. కిక్, రేసు గుర్రం చిత్రాలకు కథ అందించిన వక్కతం వంశీ ఈ చిత్రానికి కూడా కథ అందిస్తున్నారు. 

English summary
Kalyan will be producing Kick 2 starring Ravi Teja as hero and Surender Reddy of Race Gurram will be directing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu