చివరి షెడ్యూల్‌లో కళ్యాణ్ రామ్, హన్సికల చిత్రం
ఎనర్జిటిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ..ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతోంది. "అతనొక్కడే", "హరేరామ్" వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై వస్తోన్న ఈ హ్యాట్రిక్ ఫిలిమ్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన "దేశముదురు" ఫేమ్ హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా నరేన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారీ తారాగణంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్, హన్సిక, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి బ్రహ్మానందం తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ-మాటలు: బి.వి.ఎస్. రవి, సంగీతం: థామన్ ఎస్, సమర్పణ: మాస్టర్ నందమూరి శౌర్యారామ్, నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేన్.


Click it and Unblock the Notifications











