twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య రిక్వస్ట్ చేసినా కళ్యాణ్ రామ్ వద్దన్నాడట.. ఆ రెండు సెంటిమెంట్లు అడ్డొచ్చాయా!

    |

    నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించి, నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఇలాంటి రెస్పాన్స్ ఎవరూ ఊహించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

     ఫలితం ఎలా ఉన్నా

    ఫలితం ఎలా ఉన్నా

    ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం దాదాపు 50 కోట్ల మేర బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ చిత్ర రిజల్ట్ ఎలా ఉన్నా బాలయ్య నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించి రానా, హరికృష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ కూడా అందరిని మెప్పించారు.

     తండ్రి పాత్ర కోసం

    తండ్రి పాత్ర కోసం

    కళ్యాణ్ రామ్ తాన్ తండ్రి హరికృష్ణ పాత్రలో నటించడంపై గతంలోనే ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మా నాన్న యంగ్ ఏజ్ లో ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఆయన ఎలా ఉండేవారు, అందరితో ఎలా మెలిగేవారు అన్ని విషయాలు బాబాయ్ ని అడిగి తెలుసుకున్నా. ఈ పాత్రలో నటించడానికి ఆ విషయాలు చాలా ఉపయోగపడ్డాయి అని కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కళ్యాణ్ రామ్ హరికృష్ణని గుర్తు చేసేలా నటించాడని ప్రశంసలు దక్కాయి.

     బాబాయ్ రిక్వస్ట్ చేసినా

    బాబాయ్ రిక్వస్ట్ చేసినా

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించినందుకు రెమ్యునరేషన్ తీసుకోమని బాలయ్య కళ్యాణ్ రామ్ ని రిక్వస్ట్ చేశాడట. కానీ కళ్యాణ్ రామ్ బాబాయ్ రిక్వస్ట్ ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. నాన్న పాత్రలో నటించినందుకే చాలా సంతోషంగా ఉందని కళ్యాణ్ రామ్ బాలయ్యతో తెలిపాడట. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో హరికృష్ణ రథసారధిగా వ్యవహరించారు. ఆ సన్నివేశాలని ఎన్టీఆర్ మహానాయకుడులో చూపించారు.

     ఆ రెండు సెంటిమెంట్స్

    ఆ రెండు సెంటిమెంట్స్

    కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ తీసుకోకపోవడానికి రెండు సెంటిమెంట్లు అడ్డొచ్చినట్లు తెలుస్తోంది. తన తండ్రి పాత్రలో నటించడం ఓ కారణం అయితే, బాబాయ్ నిర్మాణంలో తెరకెక్కిన తొలి చిత్రంలో తాను నటించడం మరో కారణంగా తెలుస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 118 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

    English summary
    Kalyan Ram refuses to take remuneration for NTR Biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X