twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రీమియర్ షో టాక్ : నా నువ్వే.. అంతా బోరింగే, అక్కడక్కడా తమన్నా!

    |

    నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి నటించిన రొమాంటిక్ ఎంటర్ లవ్ స్టోరీ నా నువ్వే. తమన్నా అందాలు, కళ్యాణ్ రామ్ కొత్త లుక్ తో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. 180 చిత్రంతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు జయేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్స్, ట్రైలర్స్ లో తమన్నా, కళ్యాణ్ రామ్ మధ్య బలమైన కెమిస్ట్రీ చూపించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి, సినిమా ఎలా ఉంది అనే అంశాలు ఇప్పుడు చూద్దాం.

    రొమాంటిక్ లవ్ స్టోరీ

    రొమాంటిక్ లవ్ స్టోరీ

    కళ్యాణ్ రామ్ ఇంతవరకు ప్రేమ కథ చిత్రాల్లో నటించింది లేదు. తొలిసారి తమన్నాతో రొమాంటిక్ మూవీలో నటించడంతో నా నువ్వే చిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

    Recommended Video

    Naa Nuvve Movie Twitter Review
    టీజర్స్, ట్రైలర్స్ లో అందంగా

    టీజర్స్, ట్రైలర్స్ లో అందంగా

    మిల్కి బ్యూటీ తమన్నా అండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమన్నాకు యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్లుగానే తమన్నా టీజర్స్, ట్రైలర్స్ లో గ్లామర్ గా కనిపించింది. కళ్యాణ్ రామ్ తో కెమిస్ట్రీ అదిరిపోయి ఉంటుందనే భావన కలిగింది.

    చెప్పుకోవడానికి డివైడ్ టాక్

    చెప్పుకోవడానికి డివైడ్ టాక్

    యుఎస్ ప్రీమియర్స్ నుంచి నా నువ్వే చిత్రాన్ని డివైడ్ టాక్ వస్తోంది. కెమెరామెన్ పనితనం, తమన్నా గ్లామర్ మినహా ఈ చిత్రంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

    ఫస్ట్ హాఫ్ లోనే

    ఫస్ట్ హాఫ్ లోనే

    దర్శకుడు ఫస్ట్ హాఫ్ లోనే ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. బలమైన సన్నివేశాలు రూపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రేమకథ చిత్రం అంటే అందులో హీరో, హీరోయిన్ల మధ్య ఆడియన్స్ ఆకట్టుకునే కెమిస్ట్రీ ఆశిస్తారు. తమన్నా లాంటి అందాల భామ హీరోయిన్ గా అయినా ఆ విషయంలో కూడా చిత్ర యూనిట్ విఫలం చెందింది.

     విధి పేరుతో

    విధి పేరుతో

    విధి పేరుతో నమ్మ శక్యం కానీ సన్నివేశాలని ఆడియన్స్ పై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు. దీని వలన ప్రేమ కథలోని సహజత్వం దూరమైంది.

    అక్కడక్కడా తమన్నా

    అక్కడక్కడా తమన్నా

    సినిమాలో అక్కడక్కడా తమన్నా మెరుపులు తప్ప పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. కళ్యాణ్ రామ్ కూడా బాగానే నటించాడు.

    కలర్ ఫుల్ సాంగ్స్, సినిమాటోగ్రఫీ

    కలర్ ఫుల్ సాంగ్స్, సినిమాటోగ్రఫీ

    ఈ చిత్రంలో పాజిటివ్ అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే అది ముందుగా కలర్ ఫుల్ గా సాగె కొన్ని పాటలు, కెమెరామెన్ పిసి శ్రీరామ్ చూపించిన అద్భుతమైన విజువల్స్ అని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో నా నువ్వే కూడా ఓ నిరాశాజనకమైన చిత్రమనే చెప్పొచ్చు.

    English summary
    Kalyan Ram's Naa Nuvve premier show talk. Tamannaah's glamorous appearance is plus point in the movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X