Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కళ్యాణ్ రామ్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కొత్త చిత్ర ఫస్ట్ లుక్ వచ్చేసింది. కళ్యాణ్ రామ్ తాజాగా కెవి గుహన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ అయిన గుహన్ దర్శకుడిగా మారాడు. ఆసక్తికరమైన థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. గురువారం రోజు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు కావడంతో కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.
టైటిల్ ప్రకటించకుండా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బహుశా త్వరలోనే టైటిల్ ప్రకటిస్తారేమో. ఈ సమ్మర్ లో కళ్యాణ్ రామ్ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మార్చి నెలలో ఎమ్మెల్యే చిత్రం విడుదల కాగా, జూన్ 14 న నా నువ్వే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు ఆడియన్స్ ని నిరాశ పరిచాయి.
తాజాగా గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విషయంలో కళ్యాణ్ రామ్ పకడ్బందీగా వ్యవహరిస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నివేద థామస్, షాలిని పాండే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.