twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివేంజ్ స్టోరీ ('ఓం' 3D ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : కల్యాణ్‌రామ్‌ నటిస్తూ.. నిర్మించిన చిత్రం 'ఓం'. నికీషా పటేల్‌, కృతి కర్బందా హీరోయిన్స్. సునీల్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ రోజు (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ''నా నుంచి ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తున్నారు. అందుకే కాస్త ఆలస్యమైనా వారికి కావల్సిన సినిమానే అందించడానికి ప్రయత్నిస్తున్నా'' అంటున్న కల్యాణ్‌రామ్‌..ఈ చిత్రంలో మళ్లీ పెద్ద హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు.

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... ''నా సినీ జీవితానికి, సినీ పరిశ్రమలో కొత్తదనానికి మా సినిమా ఓ ప్రారంభం లాంటిది. అందుకే సినిమాకి 'ఓం' అని పేరు పెట్టాము. 'కత్తి' తరవాత మరో సినిమా చేయాలనుకొన్నప్పుడు ఈసారి ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా చూపించాలి అనుకున్నాను. 'హరేరామ్‌'లో తొలిసారి ఫ్త్లె కెమెరా వాడాం. దానికి మరో మెట్టుపైకి వెళ్లాలి. అందుకే త్రీడీ సినిమా ఆలోచన వచ్చింది. ఇప్పటికే ఈ సాంకేతిక పరిజ్ఞానంతో చాలా ఆంగ్ల చిత్రాలు వచ్చాయి. తెలుగులో ఎప్పుడో చిన్నప్పుడు 'చిన్నారి చేతన' లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సారి పూర్తి త్రీడీ పరిజ్ఞానంతో సినిమా చేయాలన్న ఆలోచనకు రూపమే మా 'ఓం'. ''అన్నారు

    'ఓం' కధ చెప్పాలంటే... ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఇది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించే ఓ యువకుడి కథ. అయితే ఈ తరహా కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. అందుకే సినిమా కథనంలో కొత్తదనం ఉండేలా చూసుకున్నాం. దాంతోపాటు కథకి త్రీడీ పరిజ్ఞానం అదనపు ఆకర్షణ అన్నారు.

    ఈ సినిమా కోసం నేను చాలా సమయాన్ని కేటాయించాను. దీంతో సినిమాల పరుగులో కాస్త వెనుకబడ్డాను. అయితే నా విరామం 'ఓం' లాంటి మంచి సినిమా కోసమే. అభిమానులకు ఈ త్రీడీ వినోదం నా విరామాన్ని మరచిపోయేలా చేస్తుంది. సాధారణ పంథాలో కాకుండా కొత్తగా ఏం చేసినా మన వాళ్లు అభిమానిస్తారు. ఈ సినిమాని అలానే అక్కున చేర్చుకుంటారు.

    బ్యానర్:ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌
    నటీనటులు:కళ్యాణ్ రామ్, కృతి కర్బందా, నికీషా పటేల్‌, కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు
    కెమెరా: అజయన్ జోసఫ్ విన్సెంట్,
    ఎడిటింగ్: గౌతంరాజు,
    కళ: కిరణ్‌,
    స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ;
    ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ
    సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.
    కథ,స్క్రీన్ ప్లే, దర్సకత్వం: సునీల్‌రెడ్డి
    నిర్మాణం: ఎన్టీఆర్ ఆర్ట్స్.

    English summary
    Om 3D, the much touted 3D visual effects extravaganza from Nandamuri Kalyan Ram is to hit screens today, finally. After several postponements owing to financial troubles, this movie is seeing light on the 19th July. Kalyan Ram, the third generation Nandamuri scion is not just acting but also producing this film which has cost him 25 Cr. The movie is just the second straight 3D film in Telugu after the recent 'Action 3D'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X