కళ్యాణ్ రామ్ 'ఓమ్' లో ఆ ఎలిమెంటే హైలెట్
హైదరాబాద్ : తెలుగులో తొలి త్రీడీ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఓమ్'లో తండ్రి పాత్రకు గొప్ప ప్రాధాన్యత ఉంది. తండ్రీ తనయుల మధ్య అనుబంధంపై ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ తండ్రిగా నటించమని కార్తిక్‌ను అడిగారు. "ఆయన ఒప్పుకుంటారో లేదోననే అనుకున్నాం. ఆ పాత్రకు ఆయనైతేనే చక్కగా సరిపోతారని భావించి వెళ్లి కలిశాం. కథ వినగానే షేక్ హ్యాండ్ ఇచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారు'' అని 'ఓమ్' దర్శకుడు సునీల్ రెడ్డి తెలిపారు.
కళ్యాణ్ రామ్ హీరోగా 3D పార్మాట్లో 'ఓం' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కృతి కర్బందా, నికీషా పటేల్ హీరోయిన్స్. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై కళ్యాణ్ రామే నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. జూన్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
3డిలో రూపొందుతున్న 'ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు. ఇటీవలే ఆడియో విడుదల చేసారు. కళ్యాణ్ కెరీర్లో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ...యాక్షన్ ప్రధానమైన కథ, కథనాలతో చిత్రం సాగుతుంది. ఆహ్లాదకరమైన వినోదం, వినసొంపైన సంగీతం జత కూడాయి. యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉన్న చిత్రాన్ని త్రీడీలో చూపించడం కత్తి మీద సాములాంటిదే. చిత్రీకరణ మొదలుపెట్టడానికి ఎనిమిది నెలల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాం అన్నారు.
ఈ చిత్రంలో కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్, స్టీరియోగ్రాఫర్స్: డేవిడ్ మైక్‌టేలర్, మార్కస్, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్: విజయ్, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్.


Click it and Unblock the Notifications











