నందమూరి ఫ్యామిలీ నుండి ‘షేర్’ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై సాయి నిహారిక సమర్పణలో 'షేర్' చిత్రం ప్రారంభమైంది. గతంలో 'కత్తి' చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిఖార్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు. మే 14వ తేదీ ఉదయం 7 గంటలకు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలోని సాయిబాబా గుడిలో సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి కళ్యాణ్ రామ్ క్లాప్ ఇవ్వగా, చిత్ర సమర్పకురాలు బేబీ సాయి నిహారిక కెమెరా స్విచాన్ చేయగా తొలి షాట్ షిరిడి సాయి బాబా విగ్రహం చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ...'కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా 'షేర్' క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సబ్జెక్టు చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ రామ్‌తో సూపర్ హిట్ తీయాలన్న కోరిక 'షేర్'తో నెరవేరబోతోందని తెలిపారు.

నిర్మాత కొమర వెంకటేష్ మాట్లాడుతూ...మా విజలక్ష్మి బేనర్లో తెరకెక్కుతున్న తొలి సినిమా. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ రోజు నుండి కంటిన్యూస్‌గా షెడ్యూల్ జరుగుతుందని తెలిపారు. మిగతా వివరాలు స్లైడ్ షోలో....

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

సాయి బాబా విగ్రహంపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇస్తున్న కళ్యాణ్ రామ్.

పూజా కార్యక్రమం

పూజా కార్యక్రమం

సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్మాతలు.

నటీనటులు

నటీనటులు

నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఓ కొత్త హీరోయిన్ నటించే ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ముఖేష్ రిషి, ఆశీష్ విద్యార్థి, షాయాజీ షిండే, విక్రంజిత్ సింగ్, అలీ, కృష్ణ భగవాన్, ఆర్.కె, రావు రమేష్, రోహిణి, ప్రియ, వేణుమాధవ్, షఫి, రఘుబాబు, తాగుబోతు రమేష్, పృథ్వీ, నర్రా శ్రీను, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, శ్రావణ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి కథ, మాటలు డైమండ్ రత్నబాబు, రచనా సహకారం: ముద్ద నాగ, మేకప్: మోహన్ పరుచూరి, స్టిల్స్: మనీషా ప్రసాద్, పబ్లిసిటీ డిజైనర్ : శివ, ఫైట్స్: రవివర్మ, ఆర్ట్: సత్య శ్రీనివాస్, ఎడిటింగ్: ప్రవీఫ్ పూడి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సర్వేష్ మురారి, సంగీతం: చక్రి, ప్రొడక్షన్ మేనేజర్: బి.శ్రావణ్ కుమార్ గౌడ్, అసోసియేట్ డైరెక్టర్స్: మూర్తి, జగదీస్ సింగ్, కుమార స్వామి రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్: అనిరుధ్, కో డైరెక్టర్: బూరుగపల్లి సత్యనారాయణ, కథ-మాటలు-దర్శకత్వం: మల్లికార్జున్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X