ఇంట్రెస్టింగ్..: 'ఎన్టీఆర్ బయోపిక్'లో కల్యాణ్ రామ్ కుమారుడు..
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి గాను దర్శకుడు తేజను కాస్టింగ్ కష్టాలు వెంటాడుతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సినిమాలోని పలు కీలక పాత్రలకు ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఏ పాత్ర సంగతెలా ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి బాలకృష్ణతో పాటు చిన్ననాటి పాత్రకూ కాస్టింగ్ కుదిరిందని తెలుస్తోంది. ఆ విశేషాలేంటో చూద్దాం..

ఎన్టీఆర్ బయోపిక్‌లో కుమారుడు:
బయోపిక్‌లో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నందమూరి కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్యరామ్ నటించనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ మొదలైంది.

బాలనటుడిగా రెండో సినిమా:
ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర కోసం శౌర్యరామ్‌ను ఓకె చేయడమే కాదు, మంగళవారం నుంచి అతనిపై సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. బాలనటుడిగా 'ఇజం' సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన శౌర్యరామ్.. ఇప్పుడు ముత్తాత పాత్రలో మెప్పించడానికి రెడీ అవుతున్నాడన్నమాట.
Recommended Video


ఫేషియల్ రికగ్నిషన్..:
ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర కోసం తేజ కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారట. ఆమె పాత్రలో ఎవరైతే బాగుంటుందో నిర్ణయించడానికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడుకుంటున్నట్లు చెబుతున్నారు.

జనవరి 18న టీజర్:
జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా.. బయోపిక్ టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చ్ నుంచి ప్రారంభమవుతుందట.


Click it and Unblock the Notifications











