twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్రెస్టింగ్..: 'ఎన్టీఆర్ బయోపిక్‌'లో కల్యాణ్ రామ్ కుమారుడు..

    |

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి గాను దర్శకుడు తేజను కాస్టింగ్ కష్టాలు వెంటాడుతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సినిమాలోని పలు కీలక పాత్రలకు ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఏ పాత్ర సంగతెలా ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి బాలకృష్ణతో పాటు చిన్ననాటి పాత్రకూ కాస్టింగ్ కుదిరిందని తెలుస్తోంది. ఆ విశేషాలేంటో చూద్దాం..

    ఎన్టీఆర్ బయోపిక్: తేజకు అదో పెద్ద సవాల్.., ఎక్కువ ఆలోచించవద్దన్న బాలయ్య!ఎన్టీఆర్ బయోపిక్: తేజకు అదో పెద్ద సవాల్.., ఎక్కువ ఆలోచించవద్దన్న బాలయ్య!

     ఎన్టీఆర్ బయోపిక్‌లో కుమారుడు:

    ఎన్టీఆర్ బయోపిక్‌లో కుమారుడు:

    బయోపిక్‌లో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నందమూరి కల్యాణ్‌ రామ్‌ కుమారుడు శౌర్యరామ్‌ నటించనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ మొదలైంది.

     బాలనటుడిగా రెండో సినిమా:

    బాలనటుడిగా రెండో సినిమా:

    ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర కోసం శౌర్యరామ్‌ను ఓకె చేయడమే కాదు, మంగళవారం నుంచి అతనిపై సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. బాలనటుడిగా 'ఇజం' సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన శౌర్యరామ్.. ఇప్పుడు ముత్తాత పాత్రలో మెప్పించడానికి రెడీ అవుతున్నాడన్నమాట.

    Recommended Video

    RGV’s biopic Lakshmi’s NTR : Here Lakshmi Parvathi's response
     ఫేషియల్ రికగ్నిషన్..:

    ఫేషియల్ రికగ్నిషన్..:

    ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్ర కోసం తేజ కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారట. ఆమె పాత్రలో ఎవరైతే బాగుంటుందో నిర్ణయించడానికి ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని వాడుకుంటున్నట్లు చెబుతున్నారు.

    ఎన్టీఆర్ బయోపిక్: ఆ రోజు అభిమానులకు పూనకాలే.., అద్దిరిపోయే టీజర్ఎన్టీఆర్ బయోపిక్: ఆ రోజు అభిమానులకు పూనకాలే.., అద్దిరిపోయే టీజర్

     జనవరి 18న టీజర్:

    జనవరి 18న టీజర్:

    జనవరి 18న ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా.. బయోపిక్ టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చ్‌ నుంచి ప్రారంభమవుతుందట.

    English summary
    Recently we have reported that three filmmakers – Teja, Puri Jagannadh and Deva Katta – were in the race to direct the highly anticipated NTR biopic with his son Nandamuri Balakrishna in the titular role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X