యూత్ ను ఆకట్టుకోనున్న నా నువ్వే... కళ్యాణ్ రామ్ ఈసారి హిట్ కొట్టబోతున్నాడు!
నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం నా నువ్వే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన లభించింది. తమిళ డైరెక్టర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు.
నా నువ్వే సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు. కథ నచ్చి ఈ సినిమాను ఈ సినిమా పి.సి.శ్రీరామ్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రంలో తమన్నా రేడియో జాకీ పాత్రలో కనిపించనున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర ట్రైలర్ ని రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ ను ఆకట్టుకోబోతోందని సమాచారం. సంగీత దర్శకుడు శరత్ అందించిన ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి. కళ్యాణ్ రామ్వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈమధ్య ఎంఎల్ఎ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో ప్రస్తుతం సినిమాటోగ్రఫర్ గుహన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











