బింబిసార విజయం తెలుగు సినీ పరిశ్రమది.. కళ్యాణ్ రామ్ ఎమోషనల్
కల్యాణ్ రామ్ ఒకడు కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినా ఆయనకు హిట్స్ మాత్రం ఎక్కువ దక్కేలేదు అనే చెప్పాలి. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో సక్సెస్ లేక ఇబ్బందులు పడుతోన్న కల్యాణ్ రామ్ ఇప్పుడు 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన దక్కడంతో మంచి కలెక్షన్లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన క్రమంలో కళ్యాణ్ రామ్ ఒక థాంక్స్ నోట్ షేర్ చేశారు. కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట రూపొందించిన సినిమానే 'బింబిసార'. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఈ సినిమాలో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో మొదటి రోజు రూ. 6.30 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 65 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు రూ. 7.27 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.50 కోట్లు గ్రాస్ వచ్చింది. 2019లో, బింబిసార కోసం పని చేయడం ప్రారంభించినప్పుడు, ఈప్రాజెక్ట్‌ను ప్రారంభించి, ఈ అద్భుతమైన కథను ప్రపంచానికి తెలియజేయడానికి చాలా ఉత్సుకతతో ఉన్నామని చెప్పుకొచ్చారు.

కానీ కోవిడ్ ఎంట్రీ ఇవ్వడం సహా పలు వేవ్స్, లాక్‌డౌన్‌ల కారణంగా ఆ ఉత్సాహం వెంటనే టెన్షన్‌గా మారిందని అన్నారు. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో మేము సినిమా ప్రేమికులందరికీ గొప్ప థియేట్రికల్ అనుభవాన్ని అందించాలని కోరుకున్నామని ఆయనే పేర్కొన్నారు. సినిమా విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉందన్న ఆయన సినీ మిత్రులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు, సినీ ప్రేమికులకు మరియు నా ప్రియమైన నందమూరి అభిమానులందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. బింబిసార విజయం మొత్తం చలన చిత్ర పరిశ్రమ విజయం అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











