Amigos Twitter Review: కల్యాణ్ రామ్ ఖాతాలో మరొకటి.. అదే మేజర్ హైలైట్.. మైత్రీ సంస్థలో తొలిసారి ఇలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. దాదాపు రెండు దశాబ్దాలుగా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ ప్రయోగాలు చేసే అతడు.. గత ఏడాది 'బింబిసార'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు కల్యాణ్ రామ్ 'అమిగోస్' అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూసేయండి మరి!

అమిగోస్‌తో వచ్చిన కల్యాణ్ రామ్

అమిగోస్‌తో వచ్చిన కల్యాణ్ రామ్


కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమానే 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో బ్రహ్మాజీ, సప్తగిరి సహా కొందరు ముఖ్య పాత్రలు చేశారు.

అలాంటి స్టోరీతో వచ్చిన చిత్రం

అలాంటి స్టోరీతో వచ్చిన చిత్రం

ఎప్పుడూ ప్రయోగాలు చేసే నందమూరి కల్యాణ్ రామ్ నటించిన చిత్రమే 'అమిగోస్'. ఈ మూవీ డాపుల్ గ్యాంగర్స్ అనే కాన్సెప్టుతో రాబోతుంది. ఒకే పోలిక ఉన్న ముగ్గురు సంబంధం లేని వ్యక్తులు కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్లంతా కలవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే అంశాలతో ఇది తెరకెక్కింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

అమిగోస్‌కు ట్విట్టర్‌లో టాక్ ఇలా


విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీ ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్లా మంచి టాక్ వచ్చింది. ట్విట్టర్‌లో ఎక్కువ శాతం మంది ఇది బాగుందనే పోస్టులు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఎలా ఉందో వెల్లడిస్తూ


నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. 'అమిగోస్ ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. మంచి సన్నివేశాలతో అద్భుతంగా చూపించిన కాన్సెప్టుతో ఈ సినిమా నడుస్తుంది. కానీ, సాదాసీదాగా సాగే బ్యాగ్రౌండ్ స్కోర్ కారణంగా సినిమా నాసిరకంగా సాగుతుంది' అంటూ చెప్పుకొచ్చాడు.

కల్యాణ్ రామ్‌కు మరో సక్సెస్

నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన 'అమిగోస్' మూవీని చూసిన మరో నెటిజన్ 'అమిగోస్ మూవీలో ఫస్టాఫ్‌లో క్యారెక్టర్లను చూపించిన తీరు, ఇంటర్వెల్ బాగున్నాయి. మొత్తంగా ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. కానీ, సెకెండాఫ్ స్పీడుగా సాగే స్క్రీన్‌ప్లే, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్‌ బాగున్నాయి. ఓవరాల్‌గా సినిమా బాగుంది. దీనికి 3/5 రేటింగ్' అంటూ అభిప్రాయపడ్డాడు.

ఎన్టీఆర్ మాటలు నిజమే అని


కల్యాణ్ రామ్ - అషికా రంగనాథ్ జంటగా నటించిన 'అమిగోస్' మూవీని వీక్షించిన మరొక నెటిజన్ 'సినిమా చూశాను. నా రేటింగ్ 3.5/5. సెకెండాఫ్ అన్ని అంశాలతో చాలా బాగుంది. దర్శకుడికి మంచి ఎంట్రీ ఇది. విభిన్నమైన కథలతో వస్తున్న కల్యాణ్ రామ్‌కు థ్యాంక్స్. ఈ స్క్రిప్ట్ గురించి తారక్ చెప్పిన మాటలు నిజం. అషిక అందంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.

ఓవరాల్‌గా సినిమా రిపోర్ట్ ఇలా


కల్యాణ రామ్ - రాజేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'అమిగోస్' మూవీని చూసిన ఇంకో నెటిజన్ ఇలా ట్వీట్ చేశాడు. 'అమిగోస్ మూవీ ఆసక్తికరమైన పాయింట్ కలిగిన సినిమా. కానీ, దీన్ని నాసిరకంగా నడిపించారు. ఇందులో ట్విస్టులు అదిరిపోయాయి. కానీ, కథనం మాత్రం కొంత స్లోగా సాగినట్లుగా అనిపిస్తుంది. దీనికి నా రేటింగ్: 2.25-2.5/5' అంటూ వెల్లడించాడు.

మైత్రీ సంస్థ నుంచి తొలిసారి

మైత్రీ సంస్థ నుంచి తొలిసారి


'అమిగోస్' మూవీని చూసిన మరో నెటిజన్ 'కల్యాణ్ రామ్ క్యారక్టరైజేషన్స్, మూడు పాత్రల ఏర్పాటు బాగున్నాయి. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బాగుండాలి. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ల ప్రొడక్షన్ వ్యాల్యూస్ అస్సలు బాలేదు. మొదటి సారి ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమా కెమెరా వర్క్ బాలేదు. దీనివల్ల పాత కాలం సినిమాల అనిపించింది' అంటూ వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X