twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కత్తి’ చిత్రం చేయటానికి కారణం అదే...కళ్యాణ్ రామ్

    By Srikanya
    |

    రచయిత వక్కంతం వంశీ కథ చెప్పినప్పుడు..ఈ చిత్రంలో వైవిధ్యమైన పాయింట్ ఏముంది అనే సందేహం అతడిముందు వ్యక్తం చేశాను. అయితే అతను చెప్పిన కథలో గత చిత్రాల్లో లేని ఓ కొత్తపాయింట్‌ ఆకర్షించింది. 'పాతతరం మనుషులు అంత తేలిగ్గా మారరు. తమవైన భ్రమల్లో ఉంటారు. అలాంటప్పుడు వారి దారిలోనే వెళ్లి మారిస్తే.." ఇదే ఆ కొత్త పాయింట్‌. సడన్‌గా మరని వాళ్లకోసం 'సమరసింహా రెడ్డి"లో ఓ డైలాగ్‌ ఉంది. 'మీరు మారొచ్చు. మా పగలు మారవు" ఇదే..ఇన్‌స్పిరేషన్‌ అంటూ తను కత్తి చిత్రం చేయటానికి ప్రేరణగా నిలిచిన విషయాలు చెప్పారు కళ్యాణ్ రామ్. క్రితం శుక్రవారం విడుదలైన కత్తి చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ ని తెచ్చుకుంది. దాంతో చిత్రాన్ని నిలబెట్టే క్రమంలో కళ్యాణ్ రామ్..ప్రమోషన్ వర్క్ ప్రారంభించారు.

    అలాగే ఈ చిత్రంలో తన నటన గురించి చెబుతూ..గతంలో కంటే బాగా చేశానని అంటున్నారు. వెబ్‌సైట్లలో రివ్యూలు బాగా వచ్చాయి. చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నానని చెబుతున్నారంతా. మా ఫ్యామిలీనుంచీ అదే ఫీడ్‌బ్యాక్ అన్నారు. 'కత్తి"లో నచ్చిన విషయాలు చెపుతూ...సహజంగా ప్రతి హీరో చేసే పాత్రే అయినా కొత్తగా అనిపించింది. చెల్లెలు అత్తింటికి వెళితే అక్కడ అత్తమామల హింస, కట్నం కోసం వేధింపులు..ఇలా సమస్యలుంటాయి. కానీ పగ ప్రతీకారం కోసం ఓ ఫ్యాక్షన్‌ కుటంబం హీరో చెల్లెలిని కోడలిని చేసుకోవడం..ఆపై హింసించడం..ఈ బాధల్నుంచి చెల్లెలిని తప్పించడానికి బావగారిపై పగచూపకుండా దారిలోకి తెచ్చుకునే వ్యూహాన్ని హీరో అమలు చేయడం..కొంచెం మోడ్రన్‌గా చూపించాం. ఎక్కడా మోతాదు మించలేదు అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X