కత్తి పట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే...కళ్యాణ్ రామ్
ఒక యువకుడికి కత్తి పట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అతని అంతిమ లక్ష్యమేంటన్నదే మా 'కల్యాణ్ రామ్ కత్తి' చిత్రంలో ప్రధానాంశం. కత్తిలాంటి కుర్రాడి చుట్టూ నడిచే కథ ఇది. మాస్, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కించాం. వినోదానికీ ప్రాధాన్యత ఉంది అంటున్నార్ కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ యన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన 'కల్యాణ్‌రామ్ కత్తి' త్వరలో హీరోగా నటిస్తూ యన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న 'కల్యాణ్ రామ్ కత్తి' చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కళ్యాణ్ రామ్ మాట్లాడారు.
సినిమా గురించి హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ తెలియజేస్తూ "మణిశర్మ సారథ్యంలో చేసిన పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్స్ చూసిన వాళ్లంతా చాలా బాగున్నాయని ఫోన్లు చేస్తున్నారు. 'అతనొక్కడే' తర్వాత నాకు ఆడియో సూపర్ అనీ, ట్రైలర్స్ బ్రహ్మాండం అనీ ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చింది ఈ సినిమాకే. ప్రేక్షకులు, అభిమానులు ఆశిస్తున్న స్థాయిలో అన్నిరకాల కమర్షియల్ అంశాలతో చిత్రం తయారైంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది" అని చెప్పారు.
కల్యాణ్ రామ్ సరసన సనా ఖాన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో శరణ్యా మోహన్ చెల్లిగా ఓ కీలకమైన పాత్ర చేస్తోంది. అలాగే ఈ చిత్రంలో శ్యామ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, అజయ్, రఘుబాబు, చంద్రమోహన్, సమీర్, మహర్షి రాఘవ, సత్యకృష్ణ, ఝాన్సీ, తెలంగాణ శకుంతల, విజయ రంగరాజా తారాగణం. వక్కంతం వంశీ కథ సమకూర్చిన ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నం, సినిమాట్రోఫీ: సర్వేశ్ మురారి, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: సత్య, డాన్స్: ప్రేమ్‌రక్షిత్, అమ్మ రాజశేఖర్, సుచిత్ర చంద్రబోస్, దినేశ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మల్లికార్జున్.


Click it and Unblock the Notifications











