తమన్నాతో ఆ సాంగ్ చేయనని చెప్పేశా.. హాట్ హాట్‌గా, ఆడియో వేడుకలో కళ్యాణ్ రామ్!

Recommended Video

Naa Nuvve Audio Launch.. Tamanna,Kalyan Ram Speech

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం నా నువ్వే. మే చివరి వారంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజగా ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. 180 చిత్రంతో మంచి గుర్తింపు పొందిన జయేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. కళ్యాణ్ రామ్ సరసన మిల్కి బ్యూటీ తమన్నా తొలి సారి నటించింది. ఈ చిత్ర ఆడియో వేడుకలో తమన్నా, కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ప్రేమ కథలో నటించడం ఇదే తొలిసారి.

నిద్ర వస్తున్నా కానీ

నిద్ర వస్తున్నా కానీ

దర్శకుడు జయంద్ర ఈ చిత్ర చిత్ర కథ తనకు వివరించడానికి ముందు తాను అమెరికా నుంచి అప్పుడే వచ్చానని, నిద్ర వస్తున్నా కూడా తాను కథ విన్నానని తమన్నా తెలిపింది. కథ ఆసక్తికరంగా ఉంది కాబట్టే వినగలిగానని తమన్నా తెలిపింది.

ఆర్జే అంటే కష్టం

ఆర్జే అంటే కష్టం

రియల్ లైఫ్ లో ఆర్జేగా ఉండడం చాలా కష్టం అని తమన్నా తెలిపింది. ఈ చిత్రం ద్వారా తనకు ఆ విషయం తెలిసిందని మిల్కి బ్యూటీ అభిప్రాయపడింది. నా నువ్వే చిత్రంలో తమన్నా ఆర్జే మీరాగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తీవ్ర జ్వరంతో

తీవ్ర జ్వరంతో

ఈ చిత్రంలో సాంగ్ చిత్రీకరిస్తున్న సమయంలో తనకు తీవ్ర జ్వరంతో ఉన్నానని, కళ్యాణ్ రామ్ లాంటి కో స్టార్ లేకపోతే ఆ సాంగ్ నేను చేసేదాన్ని కాదని తమన్నా తెలిపింది. కెమెరామెన్ పిసి శ్రీరామ్ సహకారం కూడా మరిచిపోలేనిది అభిప్రాయ పడింది.

నాకు ఇలాంటి కథా

నాకు ఇలాంటి కథా

దర్శకుడు జయేంద్ర తనకు రొమాంటిక్ లవ్ స్టోరీ వివరిస్తానని చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయానని కళ్యాణ్ రామ్ అన్నారు. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్న తనకు రొమాంటిక్ స్టోరీ ఏంటని అనుకున్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు.

తమన్నాతో రొమాంటిక్ సాంగ్

తమన్నాతో రొమాంటిక్ సాంగ్


ఈ చిత్ర ఫస్ట్ డే షూట్ లోనే తమన్నాతో రొమాంటిక్ సాంగ్ చేయవలసి వచ్చింది. అప్పటివరకు తమన్నాతో కనీసం పరిచయం కూడా లేదు. అలాంటిది అప్పుడే రొమాంటిక్ సాంగ్ ఏంటి.. నేను చేయనని నిర్మాతకు చెప్పా అని కళ్యాణ్ రామ్ అన్నారు. కానీ చేయవలసిందే అని వారు కోరడంతో చినికి చినికి అనే సాంగ్ చేసానని, తమన్నా సపోర్ట్ లేకుండా చేసే వాడిని కాదని కళ్యాణ్ రామ్ అన్నాడు.

హాట్ హాట్‌గా

చినికి చినికి సాంగ్ లో కళ్యాణ్ రామ్, తమన్నా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ చేసే సమయంలో తమన్నానే చాలా బాగా సపోర్ట్ చేసిందని కళ్యాణ్ రామ్ అభిప్రాయపడ్డాడు. తమన్నా, కళ్యాణ్ రామ్ మధ్య రొమాన్స్ ఎలా సాగిందో ఈ సాంగ్ ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X