కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్
కళ్యాణ్ రామ్ తన ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నరేన్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రానికి జయీభవ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్కుని పోస్ట్ ప్రొడక్షన్ కి రెడీ అవుతోంది. తమన్ అందించిన ఆడియో ఈ నెలాఖరుకు రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక నూతన దర్శకుడు నరేన్ (అసలు పేరు సత్తిబాబు)ఇంతకుముందు తేజ, కృష్ణవంశి, సముద్ర వద్ద పనిచేసి అనుభవం సంపాదించాడు. లక్ష్మీ కళ్యాణం నుండి కళ్యాణ్ రామ్ చిత్రాలకు వరసగా దర్శకత్వం టీమ్ లో చేస్తున్నాడు. ఇక బి.వి.యస్ రవి కథ-మాటలు అందించే ఈ చిత్రానికి కెమెరా ఎస్.దాసరధి అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ముకేష్ రుషి, ఆశిష్ విధ్యార్ధి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, వేణుమాధవ్, సుధ, చలపతిరావు తదితరలు మిగతా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.నందమూరి శౌర్యరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై గతంలో అతనొక్కడే, హరే రామ్ చిత్రాలు కళ్యాణ్ రామ్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











