నందమూరి హీరో మల్టీస్టారర్ మూవీ..ఆ విషయం సస్పెన్స్!
కళ్యాణ్ రామ్ జోరు పెంచాడు. కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే, నా నువ్వే చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వీటి తరువాత మరికొన్ని చిత్రాలని కళ్యాణ్ రామ్ ఒకే చేస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే చిత్రం ఈ శుక్రవారం విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. పటాస్ చిత్రం తరువాత కళ్యాణ్ రామ్ కు సరైన విజయం దక్కలేదు. ఎమ్మెల్యే చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని కళ్యాణ్ రామ్ ధీమాతో ఉన్నాడు.
ఆ మధ్యన కళ్యాణ్ రామ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ చిత్రం అనివార్య కారణాలవలన ఆగిపోయింది. ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ మరో మల్టి స్టారర్ చిత్రానికి ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో మరో హీరో ఎవరనేది ఇంకా తెలియలేదు. పవన్ సాధినేని దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.



Click it and Unblock the Notifications











