దర్శకుడుగా చౌదిరిని కన్ఫర్మ్ చేసుకున్న కళ్యాణ్ రామ్
యజ్ఞం చిత్రంతో దర్సకుడుగా సెటిలైన రవికుమార్ చౌదరికి రీసెంట్ గా హిట్ లు ఏమీ లేవు. బాలకృష్ణతో చేసిన వీరభద్ర చిత్రం భారీ డిజాస్టర్ గా నమోదైన తర్వాత రవికుమార్ చౌదరికి పెద్ద హీరోల నుంచి ఆపర్స్ రాలేదు. దాంతో వెనక్కి వెళ్ళి తనీష్ హీరోగా ఏం పిల్లో..ఏం పిల్లడో చిత్రం చేసాడు. కానీ అదీ భాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో వర్కవుట్ కాలేదు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ నుంచి అడ్వాన్స్ వచ్చిందని, కథపై కూర్చుంటున్నాడని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ సైతం వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ తనను నిలబెట్టే దర్సకుడు కోసం ఎదురుచూస్తున్నాడు. అతనొక్కడే తర్వాత తన బ్యానర్ లో వరస సినిమాలు చేస్తున్నా ఒక్కటీ విజయాన్ని ఇవ్వటం లేదు. ఈ క్రమంలో ఈ కాంబినేషన్ తనకి తిరిగి విజయాన్ని ఇస్తుందని, తనని మాస్ హీరోగా నిలబెట్టే సత్తా రవికుమార్ చౌదరికి ఉందని భావిస్తున్నాడు. అతని ఆశ నిజం కావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











