కళ్యాణ్ దేవ్ విజేత ఫస్ట్ లుక్ విడుదలకు సర్వం సిద్దం!
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి విజేత అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 1985లో చిరంజీవి నటించిన సూపర్‌హిట్ సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో పరిశ్రమకు ఎంట్రి ఇవ్వబోతున్నాడు కళ్యాణ్ దేవ్.
ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవికా నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఈ హీరోయిన్ నాగ శౌర్య సరసన కళ్యాణ వైభోగమే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

కళ్యాణ్ దేవ్, రాకేశ్ శశి సినిమా ఫస్ట్ లుక్ రేపు (శనివారం) విడుదల చెయ్యబోతున్నారు. చిరంజీవి నటించిన విజేత సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించబోతున్నారు.


Click it and Unblock the Notifications











