Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కళ్యాణి ‘చాప్టర్’ పూర్తి
సత్యం చిత్రం దర్శకుడు సూర్యకిరణ్ దర్శకత్వంలో ఆయన భార్య కళ్యాణి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'చాప్టర్-6" ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ కథ నాకు భాగా నచ్చడంతో నిర్మాతగా మారాను. కథాంశం పరంగా ప్రేమకథలా కాకుండా పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది, సినిమా చూస్తున్నంత సేపు ఒక అందమైన నవల చదువుతున్న అనుభూతి కలుగుతుందన్నారు. ప్రేమలోని ఆరు రకాల భావోద్వేగాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం"అని కళ్యాణి చెప్పారు.
ఆరు రంగుల్లో 'ప్రేమ'ను వర్ణిస్తున్నాం అందుకే ఈ సినిమాకి 'చాప్టర్-6" అనే టైటిల్ ఖరారు చేశామన్నారు. ప్రేమ పుట్టుకను నీలి రంగులోనూ, ప్రేమలోని పవిత్రతను తెలుపురంగులోనూ, ప్రేమలోని వైరుధ్యాన్ని నలుపు రంగులోనూ, ప్రేమలోని బాధను లేత పసుపు రంగులోనూ, ప్రేమాన్వేషణను నారింజ రంగులోనూ, ప్రేమ విజయాన్ని ఎరుపు రంగులోన వర్ణిస్తున్నాం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చిత్రీకరణ మొదలుపెట్టాం, జూలై 6తో షూటింగ్ పూర్తిఅయిందని చెప్పారు.
తన భర్త సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి 'చాప్టర్-6" అనే సినిమాని నిర్మిస్తోంది, భర్త దర్శకత్వంలో చేయటం ఇది మొదటిసారి అని కళ్యాణి తెలిపింది. ఈ చిత్రంలో తను ఓ కీలక పాత్ర కూడా పోషిస్తోంది, బాల, సోనియా సూరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో మరో విశేషం 8 పాటలతో ఒక్కొక్క పాటని ఒక్కొక్క మూజిక్ డైరెక్టర్ ఆలపించారు. ప్రస్తుతం డిటిఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలో ఆడియో రిలీజ్ చేసి అక్టోబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు.