శ్రీరెడ్డికి పెళ్లికాకుండానే.. సంచలనం రేపుతున్న కరాటే కల్యాణి లీక్స్

By Rajababu

Recommended Video

సంచలనం రేపుతున్న కరాటే కల్యాణి లీక్స్

క్యాస్టింగ్ కౌచ్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కల్పించాలని ఉద్యమం చేస్తున్న శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలను నటి కరాటే కల్యాణి బయటపెట్టడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కల్యాణి షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్‌లో చర్చ సందర్భంగా శ్రీరెడ్డి, కల్యాణి మధ్య వివాదం చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే. ఆ సయయంలో శ్రీరెడ్డి గొంతు పిసికి కల్యాణి చంపబోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై కల్యాణి సంచలన విషయాలు బయటపెట్టారు.

అసలు పేరు విమలా చౌదరీ

అసలు పేరు విమలా చౌదరీ

శ్రీరెడ్డి అసలు పేరు విమలా చౌదరీ. పెళ్లికాని ఆమెకు ఇంటర్ పూర్తి చేసిన కూతురుంది. విజయవాడ శ్రీ చైతన్య లో ఇంటర్ చదువుతోంది మొన్ననే చదువు కూడా అక్కడ అయిపోయింది . పదేళ్ల నుంచి తల్లిదండ్రులతో సంబంధాలు లేవు. కానీ కొన్నేళ్ల కింద కూకట్‌పల్లిలో కోట్ల విలువైన ఫ్లాట్‌లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఆమె వెంట తల్లికూడా ఉన్నారు అనే విషయాలను సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఖరీదైన కార్లలో తిరుగుతుంది

అలా కాకుండా తను ఖరీదైన, విలాసవంతమైన కార్లలో తిరుగుతుంది. వాటికి డబ్బులు ఎలా? ఎక్కడ నుంచి వచ్చాయో ఆమెకే తెలియాలి. మరికొన్ని లీక్స్‌ నాకు ఇష్టం ఉన్నప్పుడు బయటపెడతా.. నా లీక్స్ నా ఇష్టం అని నటి కరాటే కల్యాణి వెల్లడించారు.

కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి ఫ్యాన్స్ ఫైర్

కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి ఫ్యాన్స్ ఫైర్

శ్రీరెడ్డి వ్యక్తిగత జీవితానికి సంబంధించి నటి కరాటే కల్యాణి బహిర్గతం చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రీరెడ్డి కూతురు అని చెబుతున్న ఓ అమ్మాయి ఫోటో వివాదంగా మారింది. కరాటే కల్యాణి తీరుపై శ్రీరెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

వ్యక్తిగత జీవితాలు లాగొద్దు

వ్యక్తిగత జీవితాలు లాగొద్దు

కాగా, నటి కరాటే కల్యాణి పోస్ట్‌లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. పరిశ్రమకు సంబంధించిన గొడవల్లోకి, వివాదంలోకి వ్యక్తిగత జీవితాలను లాగొద్దని హితవు పలికింది. మీ గొడవల్లోకి కుటుంబ సభ్యులను, అందులోనూ పిల్లలను, వారి ఫొటోలను లీక్‌ చెయ్యడం ఎంతవరకు సబబు?' అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

శ్రీరెడ్డి స్పందన ఎలా ఉంటుందో..

శ్రీరెడ్డి స్పందన ఎలా ఉంటుందో..

అయితే కరాటే కల్యాణి లీక్స్‌పై శ్రీరెడ్డి స్పందన వెలువడాల్సి ఉంది. తన వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలోకి లాగడంపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఫోటోలో ఉన్న అమ్మాయి తన కూతురు అని ఒప్పుకొంటుందా? లేదా దానికి సంబంధించిన వివరణ ఇస్తుందా లేదా అని వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X