""నేను ఇంకా చిన్న పిల్లను కాను""
బాల నటి నుంచి యువహీరోయిన్ గా ఎదిగిన అమ్మాయి కళ్యాణి. తమిళంలో హీరోయిన్ గా ప్రమోషన్ పొందిన కళ్యాణికి పెద్దగా అవకాశాలు రావడంలేదు. కళ్యాణి పని అయిపోయిందని తమిళ ఇండస్ట్రీ అనుకుంది. కళ్యాణి నిరుత్సాహపడకుండా తెలుగు, మలయాళ సినిమా రంగాలపై దృష్టి కేంద్రీకరించింది. ఆమె ప్రయత్నం ఫలించింది. తెలుగులో ఛాయాగ్రాహకుడు అశోక్ కుమార్ రూపొందిస్తున్న మంచు కురిసే వేళలో సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ సినిమాలో వచ్చిన అవకాశంపై కళ్యాణి మాట్లాడింది. ఆమె మాటల్లోనే...ఇది చక్కని ప్రేమ కథ...ఈ సినిమాలో నేను చేసే పాత్ర కచ్చితంగా నాకు పేరు తెస్తుంది...మలయాళంలో ఎస్ఎమ్ఎస్ సినిమా చేశాను...తమిళంలోనూ రెండు సినిమాలు వచ్చాయి...అయినా అందరూ నన్ను చిన్న పిల్ల అనుకుంటున్నారు..చిన్న పిల్లను కాను పెద్దయ్యాను...ఆ ఇమేజ్ నుంచి త్వరలోనే బయటపడతాను..అందుకోసం ఇక గ్లామర్ పాత్రలు కూడా చేస్తాను..అంటోంది కళ్యాణి. అంతేనా.


Click it and Unblock the Notifications











