'అజ్ఞాతం'లో హీరోయిన్ కళ్యాణి
ఔను వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు, కబడ్డీ కబడ్డీ, దొంగోడు, పెద్దబాబు, ఆపరేషన్ దుర్యోధన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కళ్యాణి ప్రస్తుతం 'అజ్ఞాతం'లోకి వెళ్లింది. అజ్ఞాతం అంటే ఇంకేదో అనుకోవద్దు సుమీ. ఆమె ప్రస్తుతం 'అజ్ఞాతం' అనే చిత్రంలో నటిస్తోంది. హీరోయిన్ గా పెద్దగా నిలదొక్కుకోక పోవడంతో పెళ్లి చేసుకుని సినిమాలకి కాస్త దూరమైన కల్యాణి, అడపాదడపా మాత్రమే తెరపై కనిపిస్తోంది. తాజాగా ఆమె 'అజ్ఞాతం' అనే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సెన్సార్ కి సిద్ధమౌతోంది. శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం కమలాలయ బ్యానర్‌పై ఎస్.వి.ఎన్ రావు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...మహిళలకు సంబంధించిన సబ్జెక్టుతో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నామని, మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో ముఖ్యంగా ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం గురించి దర్శకడు శ్రీధర్ మాట్లాడుతూ...కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి సందేశాన్ని అందించే విధంగా ఈ సినిమాని రూపొందించినట్టు చెప్పాడు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నాడు. ఈచిత్రంలో ఇంకా సుబ్బరాజు, దీప్తీ ప్రియ, తనికెళ్ల భరణి, బెనర్జీ, కృష్ణ భగవాన్, ప్రభాకర్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











