twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'హలో' చూశాక మా నాన్న మాట్లాడలేదు.. అమ్మ 10 నిముషాలు అలా..కళ్యాణి కామెంట్స్!

    |

    Recommended Video

    Kalyani Priyadarshan Family Gets Emotional After Watching Hello

    అఖిల్ అక్కినేని నటించిన రెండవ చిత్రం హలో. ఈ చిత్రం పరవాలేదనిపించింది. హలొ చిత్రంతో మలయాళీ క్యూట్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ టాలీవుడ్ కు పరిచయం అయింది. గ్లామర్ లో ఏమాత్రం హద్దులు దాటని ఈ భామ అందమైన హావ భావాలతో హలో చిత్రంలో అలరించింది. హలొ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కల్యాణికి ఇప్పుడిప్పుడే అవకాశాలు మొదలవుతున్నాయి. శర్వానంద్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ లో కళ్యాణి హలొ చిత్రంలో తన అనుభవాలని పంచుకుంది.

    సినీ నేపథ్యం ఉన్న కుటుంబం

    సినీ నేపథ్యం ఉన్న కుటుంబం

    కళ్యాణి ప్రియదర్శన్ సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. దీనితో ఆమె సినీ రంగ ప్రవేశం సులువు అయ్యిందే కానీ.. అందులో వారి ప్రమేయం లేదని అంటోంది. కళ్యాణ్ తండ్రి ప్రియదర్శన్ మలయాళంలో ప్రముఖ దర్శకుడు. ఆమె తల్లి లిస్సి అలనాటి అందాల హీరోయిన్.

    ఆ భయంతోనే క్రిష్ 3 చిత్రం కోసం

    ఆ భయంతోనే క్రిష్ 3 చిత్రం కోసం

    కళ్యాణి ప్రియా దర్శన్ కెరీర్ పరంగా మొదటి ఛాయిస్ సినీ రంగమే అని చెబుతోంది. కానీ వెంటనే హీరోయిన్ కావాలని భావించలేదట. నటిగా రాణించగలనా లేదా అనే సందేహంతో మొదట క్రిష్ 3 సినిమా కోసం అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిందట.

    ఇంటర్వ్యూలంటే భయం

    ఇంటర్వ్యూలంటే భయం

    కల్యాణికి ఇంటర్వ్యూల ఫోబియా ఉందట. ఎందుకంటే సెలెబ్రిటీలు చైనా తప్పు చేసినా మీడియాలో పెద్ద గొడవగా మారుతుంది. అందువలనే ఇంటర్వ్యూలు చాలా తక్కువగా ఇస్తూఉంటా అని తెలిపింది. మీడియాతో మాట్లేడేసమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుందట.

    సినిమాల్లోకి వస్తానంటే

    సినిమాల్లోకి వస్తానంటే

    తాను సినిమాల్లోకి వస్తానంటే తన తల్లిదండ్రులు ప్రోత్సహించారని కళ్యాణి తెలిపింది. కానీ తనకు వారు ఎలాంటి సలహాలు ఇవ్వలేదట. సొంతంగా ఎదగాలని అలా చేసినట్లు కళ్యాణి చెప్పుకొచ్చింది.

    వారసులపైనే ఒత్తిడి

    వారసులపైనే ఒత్తిడి

    స్టార్ వారసులైతే సినిమాల్లో రాణించడం సులువు అని అంతా భావిస్తారు. కానీ అది నిజం కాదు. మాపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కళ్యాణి చెప్పుకొచ్చింది. తాము సొంతంగా ఇమేజ్ సంపాదించుకోవడానికి కష్టాలు పడాలని తెలిపింది.

    హలోతో అవకాశం

    హలోతో అవకాశం

    తనకు హలొ చిత్రం ద్వారా వచ్చిన అవకాశంతో తానేంటో నిరూపించుకోవాలని ప్రయత్నించినట్లు కళ్యాణి తెలిపింది. అందులో విజయం సాధించానని తాను భావిస్తున్నట్లు ఈ ముద్దు గుమ్మ అభిప్రాయ పడింది.

    హలో చూశాక నాన్న మాట్లాడలేదు

    హలో చూశాక నాన్న మాట్లాడలేదు

    మా నాన్న పెద్ద క్రిటిక్. చిన్న తప్పు చేసినా గంటల కొద్దీ క్లాస్ పీకుతారు. కానీ హలొ చిత్రం చూసాక ఆయనే ఏం మాట్లాడలేదు. అదే తనకు పెద్ద కాంప్లిమెంట్ అని కళ్యాణి తెలిపింది.

    అమ్మ 10 నిమిషాలపాటు

    అమ్మ 10 నిమిషాలపాటు

    హలొ చిత్రం చూసాక అమ్మ తనని పట్టుకుని పది నిముషాలు ఏడ్చేసింది. తన నటన అమ్మకు అంత బాగా నచ్చిందని కళ్యాణి తెలిపింది.

    మోహన్ లాల్ కూడా

    మోహన్ లాల్ కూడా

    తనని ప్రోత్సహించిన వారిలో లెజెండ్రీ నటుడు మోహన్ లాల్ పాత్ర కూడా ఉందని కళ్యాణి వివరించింది. మోహన్ లాల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. హలొ చిత్రం చూసాక ఆయన తనని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారని కళ్యాణి తెలిపింది.

    రెండవ సినిమా అదే

    రెండవ సినిమా అదే

    తనకు దక్షణాది భాషలన్నిటిలో నటించాలని ఉన్నట్లు కళ్యాణి తెలిపింది. తన రెండవ చిత్రం శర్వానంద్ సరసన నటిస్తున్నానని కళ్యాణి తెలిపింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

    English summary
    Kalyani Priyadarshan about her experience with Hello movie. Emotional comments on her parents
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X