అతడినే పెళ్లాడుతా.. కల్యాణి ప్రియదర్శన్.. నటిగా మారకముందు ఏం చేసేదో తెలుసా?

By Rajababu

Recommended Video

హలో మూవీ రివ్యూ, ప్రేక్షకుల స్పందన !

అక్కినేని నాగార్జున నిర్మాతగా ఆయన తనయుడు అఖిల్ హీరోగా రూపొందిన హలో చిత్రంలో హీరోయిన్‌గా కల్యాణి ప్రియదర్శన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అందంతోనే కాదు అభినయంతో కూడా కల్యాణి మెప్పించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. సినిమా బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కల్యాణి గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సినీ నేపథ్యం నుంచి కల్యాణి

సినీ నేపథ్యం నుంచి కల్యాణి

హలో చిత్రంలో మెరిసిన కల్యాణి ప్రియదర్శన్ ఎవరో కాదు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, ప్రముఖ నటి లిజి ముద్దుల కూతురే కల్యాణి. నాగార్జున, అమల నటించిన నిర్ణయం చిత్రానికి ప్రియదర్శన్ అని తెలిసిందే.

 ప్రియదర్శన్, లిజి కూతురుగా

ప్రియదర్శన్, లిజి కూతురుగా

ఇక లిజి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆత్మబంధువు, 20వ శతాబ్దం చిత్రంలో తన నటనతో లిజీ మెప్పించింది. మళ్లీ పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా రూపొందించే నితిన్‌ చిత్రంలో లిజీ సెకండ్ ఇన్సింగ్స్‌ను ప్రారంభించనున్నారు.

 సాబుసిరిల్ వద్ద అసిస్టెంట్‌గా

సాబుసిరిల్ వద్ద అసిస్టెంట్‌గా

అలాంటి సినీ నేపథ్యం ఉన్న కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా మారకముందు సింగపూర్, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసింది. అలాగే నటిగా మారక ముందు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబి సిరిల్ వద్ద ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసింది. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ చిత్రానికి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేయడం గమనార్హం.

బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా

బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకొన్న తర్వాత కల్యాణి భారీ కసరత్తే చేసింది. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉండే ఆమె నాజుకుగా మారింది. అందంగా కనిపించడానికి దాదాపు 25 కిలోల బరువు తగ్గింది.

 కల్యాణికి ఇష్టమైన వారిలో

కల్యాణికి ఇష్టమైన వారిలో

కల్యాణి ప్రియదర్శన్‌ తమిళంలో నజ్రియా, హిందీలో అలియాభట్ ఇష్టమట. ఇక మలయాళంలో మోహన్ లాల్, హిందీలో రణ్‌వీర్ సింగ్ తనకు ఫేవరేట్ హీరోలు. వీరి సినిమాలను మిస్‌కాకుండా చూడటం కల్యాణికి అలవాటు.

అమ్మతో నటించాలని

అమ్మతో నటించాలని

హీరోయిన్‌గా మారిన తర్వాత నాకు అమ్మ లిజితో నటించాలని అనిపిస్తున్నది. అమ్మతో నటించే అవకాశం వస్తే మాత్రం అసలే వదులుకోను. తల్లితో తెర మీద కనిపించడం కంటే ఆనందం ఏమి ఉంటుంది అని కల్యాణి ప్రియదర్శన్ చెప్పింది.

 అతడినే పెళ్లాడుతా??

అతడినే పెళ్లాడుతా??

పెళ్లి గురించి కూడా కల్యాణి స్పష్టమైన అవగాహనతోనే ఉంది. 2022లో తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లాడుతానంటుంది ఈ ముద్దుగుమ్మ. చాలారోజులుగా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా ఉంటున్న రితుల్ బ్రూస్ లీని పెళ్లాడుతానని కల్యాణి చెబుతున్నది. అప్పటివరకు వారిద్దరూ ప్రేమలోనే ఉంటారట.

 హలోతో మంచి పేరు

హలోతో మంచి పేరు

ప్రస్తుతం అఖిల్ అక్కినేనితో కలిసి నటించిన హలో చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. ఈ చిత్రానికి మంచి టాక్ రావడం, ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. హలో తర్వాత ఇంకా ఏ చిత్రాన్ని కూడా అంగీకరించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X