నా హీరోయినే నిర్మాతగా..రాజశేఖర్
నేను హీరోగా చేసిన 'శేషు' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన కల్యాణి నిర్మాతగా మారి నాతో చిత్రం తెరకెక్కించడం ఆనందంగా ఉందని రాజశేఖర్ చెప్పారు. ఆయన హీరోగా కళ్యాణి భర్త సూర్య కిరణ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మీడియా సమావేశం పెట్టి తెలియపరిచారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ...''సంక్రాంతి తరవాత చిత్రీకరణ మొదలవుతుంది. సోషియో ఫాంటసీ తరహా చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా సాగుతుంది. రాజశేఖర్ ఇంతకు మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తార''ని అన్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ ''సూర్యకిరణ్ మంచి సాంకేతిక నిపుణుడు. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని ప్రయత్నించాం. ఇన్నాళ్ళకు కుదిరింది అన్నారు. మిడాస్‌టచ్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది.ఇక కళ్యాణి తన భర్త దర్శకత్వంలో నిర్మించిన ఛాప్టర్ సిక్స్ చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది.
More from Filmibeat
రాజశేఖర్ కళ్యాణి సూర్య కిరణ్ శేషు మిడాస్ టచ్ సోషియో పాంటసి చాప్టర్ సిక్స్ rajashekar sheshu surya kiran midas touch socio fantacy kalyani chapter six


Click it and Unblock the Notifications











