జగపతిబాబు...కల్యాణి కాంబినేషన్ లో 'కబడ్డీ కబడ్డీ', 'పెదబాబు', 'పందెం', 'లక్ష్యం' సినిమాలు వచ్చాయి . . హిట్టయ్యాయి. మళ్ళీ వీరిద్దిరి కలయికతో 'గాలి' అనే సినిమా రూపొందుతోంది. దాంతో వీరి జంట ఐదో సారి ఒక్కటయ్యినట్లైంది. చాలామంది వెనుకగా చెప్పుకునే వీరి అనుబంధానికి ఆధారం దొరికిన ఫీలింగ్ కల్గించింది. జగపతి బాబు ఇప్పుడు జె.డి. చక్రవర్తి 'హోమం' లో నటిస్తున్నాడు. కళ్యాణి పెళ్ళైన తరువాత అడపా తడపా నటించినా గ్లామర్ రోల్స్...మెయిన్ హీరోయిన్ గానూ చేయలేదు. దాంతో 'గాలి' లో ఎలా కనిపిస్తుందనే ఆసక్తి పరిశ్రమలో ప్రతీ ఒక్కరిలోనూ కనపడుతోంది. అలాగే ఇంకా ఈ పెయిర్ కి మార్కెట్ లో డిమాండు ఉందా అని ఆలోచనలో పడుతున్నారు. అంతే గాక రామ్‌గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అతను ఇంతకు ముందు వంశీ 'అనుమానుస్పదం' సినిమాకు కధ అందించాడు. కొత్త దర్శకుడు, ఫెయిల్యూర్ లో ఉన్న నిర్మాత,క్రేజ్ లేని కాంబినేషన్ ఎంత వరకూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాయో చూడాలంటున్నారు. ఈ గాలి కబుర్లకు అతీతంగా ఈ సినిమా తొలి షెడ్యూలు విజయవంతంగా పూర్తి చేసుకుని మే 15 నుంచి జరగబోయే రెండో షెడ్యూలు షూటంగ్ ప్లాన్ చేసుకుంటోంది.
Story first published: Wednesday, April 22, 2026, 5:12 [IST]