కళ్యాణ్ రామ్ సినిమాలో బాలకృష్ణ?
ఒకే కుటుంబంలోని నటులు కలిసి నటించడం కొత్తేంకాదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలలో చిరంజీవి హీరో కాగా, తమ్ముడు పవన్ కళ్యాణ్ గెస్ట్ పాత్రలో కనిపించాడు. అక్కినేని నాగేశ్వర్ రావు, అక్కినేని నాగార్జున శ్రీ రామదాసు సినిమాలో కలిసి నటించారు. అంతకుముందు కూడా నటించారు. ఇపుడు నందమూరి బాలకృష్ణ, తన అన్న హరికృష్ణ కొడుకు కళ్యాణ్ రామ్ తో కలిసి నటించనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. బాలకృష్ణ రంగా పాండు రంగా సినిమా అయిపోయిన వెంటనే కళ్యాణ్ రామ్ తో కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, తారక్ లు గతంలోనే బాబాయ్ తో కలిసి నటించాలని ఉందని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











