twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్యాణ్ రామ్ ‘ఓం’ 3D రిలీజ్ డేట్ ఖరారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కళ్యాణ్ రామ్ హీరోగా 3D పార్మాట్లో 'ఓం' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బేనర్‌పై కళ్యాణ్ రామే నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. జూన్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    3డిలో రూపొందుతున్న 'ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు. ఇటీవలే ఆడియో విడుదల చేసారు. కళ్యాణ్ కెరీర్లో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

    ఈ సినిమా గురించి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానమైన కథ, కథనాలతో చిత్రం సాగుతుంది. ఆహ్లాదకరమైన వినోదం, వినసొంపైన సంగీతం జత కూడాయి. యాక్షన్‌ అంశాలు ఎక్కువగా ఉన్న చిత్రాన్ని త్రీడీలో చూపించడం కత్తి మీద సాములాంటిదే. చిత్రీకరణ మొదలుపెట్టడానికి ఎనిమిది నెలల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టాం.

    అమెరికా నుంచి నిపుణులను తీసుకొచ్చి చిత్రీకరణ చేశాం. స్టెప్‌ అప్‌3, ఫైనల్‌ డెస్టినేషన్‌, స్పైడర్‌మేన్‌4, అవతార్‌, రెసిడెంట్‌ ఈవిల్‌ లాంటి చిత్రాలకు పని చేసిన అనుభవం వాళ్లకు ఉంది. రెడ్‌ ఎపిక్‌, త్రీడీ రిగ్‌ కెమెరాలు, లెన్స్‌లు అక్కడి నుంచే వచ్చాయి. సుమారు 150 రోజులపాటు షూటింగ్‌ చేశాం. కొన్ని నెలలుగా అమెరికా, సింగపూర్‌ల్లో త్రీడీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి' అన్నారు.

    ఈ చిత్రంలో కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్‌, స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.

    English summary
    Kalyanram’s prestigious film Om finished all censor formalities and is set to the hit the screen on June 28th. Kriti Kharbanda and Nikesha Patel have played the lead roles in the film and Sunil Reddy has directed the film. Kalyan Ram has produced the film under NTR Arts banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X