కల్యాణ్‌రామ్ తదుపరి చిత్రం
ప్రస్తుతం తేజ దర్శకత్వంలో లక్ష్మీ కల్యాణం చిత్రంలో నటిస్తున్న కల్యాణ్‌రామ్ అప్పుడే తమ తదుపరి చిత్రం ప్లాన్ చేసుకున్నారు. తమ బాబాయి బాలకృష్ణ హీరోగా విజయేంద్రవర్మ చిత్రానికి దర్శకత్వం వహించిన స్వర్ణ సుబ్బారావు డైరెక్షన్‌లో కల్యాణ్‌రామ్ నటించబోతున్నారు. సుమంత్, చార్మి జంటగా ప్రస్తుతం చిన్నోడు చిత్రం నిర్మిస్తున్న కాట్రగడ్డ లోకేశ్ తమ తదుపరి చిత్రంగా కల్యాణ్‌హీరో, స్వర్ణ సుబ్బారావుల కాంబినేషన్‌లో రూపొందిస్తున్నారు.
దీనికి సంబంధించి కథా చర్చలు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ కథ బాగా నచ్చడంతో కల్యాణ్‌రామ్ వెంటనే ఓకె చెప్పారు. విజయేంద్రవర్మ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అవకాశాలు కోల్పోయిన స్వర్ణ సుబ్బారావు ఈ చిత్రంతో అయినా దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి.


Click it and Unblock the Notifications