కల్యాణరామ్ పెళ్లి వేడుక
నందమూరి కల్యాణ్‌రామ్ వివాహ వేడుక కొసరాజు స్వాతితో ఆగస్టు 9 బుధవారంనాడు రాత్రి ఘనంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి రెసెప్షన్ ఏర్పాటు చేయగా తెలుగు సినీపరిశ్రమలో ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు అనేకమంది వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. కల్యాణరామ్ తండ్రి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ, ఇతర నందమూరి సోదరులు ఆహ్వానితులకు సాదరంగా స్వాగతం పలికారు.
పెళ్లికి హాజరైన వారిలో అక్కినేని నాగేశ్వరరావు, డి. రామానాయుడు, కె. రాఘవేంద్రరావు, చిరంజీవి, అల్లు అరవింద్, కైకాల సత్యనారాయణ, పవన్‌కల్యాణ్, నాగార్జున, వెంకటేష్, సురేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, కృష్ణంరాజు, రవితేజ, శ్రీహరి, నితిన్, అల్లు అర్జున్, మురళీమోహన్, సి. అశ్వినీదత్, వై.వి.ఎస్. చౌదరి, సురేందర్ రెడ్డి, బాబూమోహన్, పూరీ జగన్నాథ్, బ్రహ్మానందం, ఎ.ఎస్. రవికుమార్ చౌదరి, ఆర్. నారాయణమూర్తి, కోడి రామకృష్ణ, ఇవివి, జయప్రద, శారద, దర్శకుడు తేజ తదితరులు హాజరయ్యారు. ఇంకా ఈనాడు గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, ఆయన సతీమణి, మార్గదర్శి ఎండి శైలజాకిరణ్, కేర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సోమరాజు తదితరులు రెసెప్షన్‌కు హాజరయ్యారు. రాష్ట్ర హోమ్ మంత్రి కె. జానారెడ్డి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు దేవేందర్‌గౌడ్, ఎర్రబిల్లి దయాకర్‌రావు, ఎంపి ఎర్రంనాయుడు ఇతర రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.
అయితే, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు ఈ పెళ్లి వేడుకలో పాల్గొనలేకపోయారు. వరదల ఉధృతి కారణంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో చిక్కుబడిపోవడంతో ఆయన పర్యటన మరో రోజు వాయిదా పడింది. దీనితో పెళ్లి వేడుకకు హాజరుకాలేకపోతున్నట్టు ఆయన హరికృష్ణకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది.
అనంతరం గురువారం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాలకు మిథున లగ్నంలో కల్యాణరామ్ వేదమంత్రోచ్ఛారణల మధ్య వివాహం జరిగింది. కల్యాణ్‌రామ్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో లక్ష్మీకల్యాణం చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications