షారుక్.. రెండేళ్లలో నీవు ఖతం.. నీ అంతు చూస్తా.. బాద్షాకు సీరియస్ వార్నింగ్

బాలీవుడ్ అగ్రహీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌లపై వివాదాస్పద సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ విరుచుకుపడ్డారు. తన ట్విటర్ అకౌంట్ సస్సెన్షన్‌కు వారే కారణమని ఆయన నిప్పులు చెరిగారు.

By Rajababu

బాలీవుడ్ అగ్రహీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌లపై వివాదాస్పద సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ విరుచుకుపడ్డారు. తన ట్విటర్ అకౌంట్ సస్సెన్షన్‌కు వారే కారణమని ఆయన నిప్పులు చెరిగారు. తాజాగా కొత్త ట్విట్టర్ అకౌంట్‌తో మరోసారి కమల్ ఖాన్ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అగ్రహీరోలే కారణమని ట్వీట్ చేశారు.

షారుక్, అమీర్, సల్మాన్ కారణం

నా ట్విట్టర్ అకౌంట్‌ తొలగింపునకు షారుక్, అమీర్, సల్మాన్ ఖాన్ కారణం. నా అకౌంట్‌ను సస్పెండ్ చేయడం వల్ల నన్ను ఆపలేరు. చెత్త సినిమాల చూసే దుస్థితి నుంచి ప్రేక్షకులను కాపాడటానికి నేను సినిమాలు రాస్తూనే ఉంటాను. నన్ను అడ్డుకోవడానికి బదులు వారు మంచి సినిమాలు తీసే విషయంపై దృష్టి పెట్టాలి అని కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశారు.

షారుక్‌పై కమల్ ఫైర్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌పై కమల్ ఆర్ ఖాన్ మండిపడ్డారు. వచ్చే రెండేళ్లలో చెత్త సినీ క్రిటిక్స్‌ను ఫినిష్ చేస్తాను అని ఓ టాప్ డైరెక్టర్‌తో షారుఖ్ అన్నట్టు వచ్చిన వార్తపై కమల్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. థ్యాంక్యూ షారుక్. వచ్చే రెండేళ్లలో క్రిటిక్స్ లేకుండా పోతారో.. లేక నీకు నీవు ఫినిష్ అవుతావో తేల్చుకొందాం అని కమల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పాకిస్థాన్ నా ట్విట్టర్‌పై కుట్ర

తన ట్విట్టర్ అకౌంట్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం బ్లాక్ చేసింది అని ట్విట్టర్ చెప్పిన విషయంపై కూడా కమల్ ఖాన్ స్పందించారు. నా ట్విట్టర్ అకౌంట్‌ను బ్యాన్ చేసినందుకు పాకిస్థాన్ ప్రభుత్వానికి నా థ్యాంక్స్. మీ ప్రభుత్వం హిట్లర్‌ను తలపిస్తున్నది. ఎప్పుడో ఒకరోజు మిమ్మల్ని భారత ప్రభుత్వం నిషేధిస్తుంది. వేచి చూడండి అని కమల్ ఖాన్ ట్వీట్ చేశారు.

 కమల్ వివాదాస్పద ట్వీట్లు

కమల్ వివాదాస్పద ట్వీట్లు

అక్టోబర్ 18వ తేదీన క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. అమీర్ ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా క్లైమాక్స్ గురించి కమల్ తన ట్విట్టర్లో తెలుపగానే అకౌంట్ హ్యాకింగ్ గురైంది. గతంలో కూడా అలియాభట్, బిపాసా బసు, ఇతర నటీనటులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విక్రమ్ భట్ కూడా ఆయనపై కేసు పెట్టాడు.

 ఆత్మహత్య చేసుకొంటా..

ఆత్మహత్య చేసుకొంటా..

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ట్విట్టర్ అకౌంట్ కావడంతో బాలీవుడ్ అగ్ర హీరోలపై కమల్ మండిపడ్డారు. తన అకౌంట్ పునరుద్దరించకపోతే ఆత్మహత్య చేసుకొంటాను అని బెదిరించారు. కానీ పాత అకౌంట్ పునరుద్ధరణ కాకపోవడంతో మళ్లీ కొత్త అకౌంట్‌‌ను తెరిచి షారుక్, అమీర్, సల్మాన్‌పై మాటల దాడి ప్రారంభించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X