»   » రజనీకాంత్ చూడటానికి చాలా చండాలంగా ఉంటాడు: కమాల్ ఆర్ ఖాన్ కి పిచ్చి పట్టిందా..??

రజనీకాంత్ చూడటానికి చాలా చండాలంగా ఉంటాడు: కమాల్ ఆర్ ఖాన్ కి పిచ్చి పట్టిందా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమాల్ ఆర్ ఖాన్ బాలీవుడ్ లో పెద్ద చెప్పుకోదగ్గ నటుడేం కాదు 2008 లో దేశ్ ద్రోహీ అనే ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీసి అది కనీస స్థాయి సినిమాకూడా కాదు అనిపించుకున్నాక ఇలా అయితే లాభం లేదనుకున్నాడో ఏమో గానీ ట్విట్తర్ మీద పడ్డాడు. రీసెంట్ గా అలియా భట్ చేసిన ఒక బికినీ షూట్ ఫొటోపై అభ్యంతరకర కామెంట్స్ చేసి, బాలీవుడ్ కోపానికి గురయ్యాడు ఈ ప్రబుద్ధుడు. ఒక సారైతే ఇతగాడి పిచ్చి చేష్తలని భరించలేక బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కలిసి వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వద్దకు వెళ్లి, కమాల్ ఖాన్ ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి.

ఈ కమేడియన్ ఆఫ్ బాలివుడ్ గా కొందరి చేత పిలవబడే కమాల్ ఆమధ్య సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు.పవన్ కళ్యాణ్ మీద పిచ్చి కామెంట్స్ చేశాడు. అసలు ఇలాంటి జోకర్, కార్టూన్ లాంటి హీరో కంటే రాజ్ పాల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూడటానికి ప్రిఫర్ చేస్తాను. సౌత్ ఇండియన్ పీపుల్ కు ఏమైంది. ఇలాంటి కార్టూన్ ను సినిమాల్లో హీరోగా ఎలా చూస్తారు..? వెరీ బ్యాడ్ ఛాయిస్. ఇతనే హీరో అంటే, ప్రపంచంలో ఎవరైనా హీరో అయిపోవచ్చు అంటూ ట్వీట్లు పెట్తి సౌత్ ఇండియాలోనూ పాపులర్ అయ్యాడు.

Kamaal R Khan Just Called Superstar Rajinikanth Worst Looking

అంతకు ముందుకూడా ఒక సారి రజనీకాంత్ కొచ్చాడయాన్ సినిమా రిలీజ్ కాకముందే తిట్టినా, ధనుష్ హిందీ సినిమా రాన్ జానా రిలీజ్ కు ముందు ధనుష్ పై కాంట్రవర్సీ విమర్శలు చేసిన ఈ కమా ఆర్ ఖాన్ రీసెంట్ గా మరో సారి సౌత్ ఇండియాకే కాదు ఇండియా మొత్తానికీ సుపరిచితుడైన సూపర్ స్టార్ రజినీ కాంత్ మీద విరుచుకు పడ్డాడు. రజనీకాంత్ చూడటానికి చాలా చండాలంగా ఉంటాడు కానీ ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడా ? లేదా ? సూపర్ స్టార్ కావడానికి అందం ఒక్కటే సరిపోదని రజనీ నిరూపించాడని అంతే కాదు అందంగా ఉండే వారు మత్రమే సూపర్ స్టార్ కారని రజినీ ని ఘోరంగా అవమానించాడు. ఇలా చీప్ ట్రిక్స్ తో పబ్లిసిటీ చేసుకునే కమాల్ ఖాన్ ని పటించుకోవటం బాలీవుడ్ ఎప్పుడో మానేసింది. అందుకే ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్లను టార్గెట్ చేయటం మొదలు పెట్టాడు.
English summary
This time however Kamal R Khan went way ahead and took a potshot at the God of South cinema, superstar Rajinikanth. Yes, without any fear of the consequences, KRK in his recent tweet called Rajini Sir tiny and worst looking.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu