కారణం అమీర్ ఖానే, ఆత్మహత్య చేసుకుంటా: కెఆర్‌కె బెదిరింపులు

బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయింది.

By Bojja Kumar

కమాల్ ఆర్ ఖాన్ (కెఆర్‌కె) గుర్తున్నాడా? ఆ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' హిందీ రిలీజ్ సమయంలో ట్విట్టర్లో నానా రచ్చ చేశాడు. పవర్ స్టార్ మీద దారుణమైన కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత బాహుబలి స్టార్స్ ప్రభాస్, దగ్గుబాటి రానా మీద కూడా తన దురహంకార వ్యాఖ్యలతో చెలరేగిపోయిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్లో తనకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ రెచ్చిపోయే ఇతగాడికి ఇపుడు తగినశాస్తి జరిగింది. ట్విట్టర్ వెబ్‌సైట్ ఇతగాడి అకౌంట్ సస్పెండ్ చేసింది.

ఆత్మహత్య చేసుకుంటా

ఆత్మహత్య చేసుకుంటా

తన అకౌంట్ బ్లాక్ కావడంతో ట్విట్టర్ ఇండియాపై బెదిరింపులకు దిగాడు కెఆర్‌కె. వెంటనే తన అకౌంట్ యాక్టివేట్‌ చేయాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రకటన విడుదల చేశారు.

కారణం అమీర్ ఖాన్ అంటూ ఆరోపణలు

కారణం అమీర్ ఖాన్ అంటూ ఆరోపణలు

తన ట్విటర్‌ అకౌంట్ సస్పెండ్‌ చేయించింది బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ ఖాన్ అని, అతడి తాజా సినిమా ‘సీక్రెట్ సూపర్ స్టార్' మీద తాను విమర్శలు చేయడం వల్లనే ఇదంతా చేయించాడని కెఆర్‌కె ఆరోపించారు.

15 రోజులు డెడ్‌లైన్ పెట్టిన కమాల్ ఆర్ ఖాన్

15 రోజులు డెడ్‌లైన్ పెట్టిన కమాల్ ఆర్ ఖాన్

15 రోజుల్లో తన ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్‌ చేయాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుకు కారణమైన ట్విటర్‌ ఇండియా టీంను పోలీసులు అరెస్ట్‌ చేస్తారంటూ.... కెఆర్‌కె తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

అసలు కారణం అదే..

అసలు కారణం అదే..

ట్విట్టర్ వెబ్ సైట్ కెఆర్‌కె అకౌంట్ సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం... అతడి మీద వేల సంఖ్యలో కంప్లయింట్స్ ఉండటమే. తప్పుడు కామెంట్స్ చేస్తున్నాడని, ఇతరులను కించపరుస్తూ పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ అతడి మీద ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ట్విట్టర్ సంస్థ అతడి అకౌంట్ సస్పెండ్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X