»   » వివాదం: తాగుబోతు, ఇడియట్ అంటూ పెద్దాయనపై బూతులు!

వివాదం: తాగుబోతు, ఇడియట్ అంటూ పెద్దాయనపై బూతులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కాంగ్రెస్‌లోని గాంధీ కుటుంబంపై నిప్పులు కురిపించినసంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడికెళ్ళినా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లే కనిపిస్తున్నాయని, దేశానికి సేవ చేసినవాళ్ళు వీళ్ళిద్దరేనా? అని ట్విట్టర్ ప్రశ్నించారు. అయితే రిషి కపూర్ వ్యాఖ్యపై బాలీవుడ్ దర్శకుడు, నటుడు కమాల్ రషీద్ ఖాన్ మండి పడ్డారు. రిషి కపూర్ మీద ఎదురు దాడిప్రారంభించారు.

రిషి కపూర్ తాగి వాగుతున్నాడని, ఇందిరా గాంధీ లాంటి వారిని తిడుతూ ఇడియట్ లా ప్రవర్తిస్తున్నాడంటూ మండి పడ్డారు. అంతే కాకుండా హిందీలో కొన్ని బండ బూతులు కూడా రిషి కపూర్ మీద ప్రయోగించాడు కమాల్ ఆర్ ఖాన్.

కొన్ని రోజుల క్రితం 'సర్దార్ గబ్బర్ సింగ్' హిందీ విడుదలపై కూడా కమాల్ ఆర్ ఖాన్ పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను అవమానిస్తూ ట్విట్టర్లో చాలా కామెంట్స్ చేసాడు. ఇపుడు రిషీ కపూర్ మీద ఎదురు దాడి చేసి వార్తల్లోకి ఎక్కాడు.

రిషి ట్విట్టర్లో కపూర్ ఏమన్నాడు?

రోడ్లు, విమానాశ్రయాలు, వివిధ సంస్థలకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టడంపై తన అభిప్రాయాలను రిషి కపూర్ ట్విటర్‌ ద్వారా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ హయాంలో పెట్టిన అన్ని పేర్లనూ మార్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అన్న పేరును విమర్శించారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అంబేద్కర్ వంటివారి పేరుగానీ, లేదంటే తన పేరు (రిషి కపూర్) కానీ ఎందుకు పెట్ట కూడదని ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమైన ఆస్తులకు సమాజానికి సేవ చేసినవారి పేర్లు పెట్టాలన్నారు.

స్లైడ్ షోలో కమాల్ ఆర్ ఖాన్ ట్వీట్స్..

ట్విట్టర్ వార్

ట్విట్టర్ వార్


రిషి కపూర్ చేసిన కామెంట్ల మీద కమాల్ ఆర్ ఖాన్ మండి పడ్డారు. ఎదురు దాడి చసాడు. బూతులు తిట్టాడు.

ఇడియట్

ఇడియట్


రిషి కపూర్ ను ఇడియట్ అంటూ సంబోధిస్తూ కమాల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్

బూతులు

బూతులు


రిషి కపూర్ మీద హిందీలో బూతులు ప్రయోగిస్తూ రెచ్చిపోయాడు.

సిరీయస్

సిరీయస్


రిషి కపూర్ కామెంట్ల మీద కమాల్ ఆర్ ఖాన్ సీరియస్ గానే స్పందించారు.

ఆగుతుందా?

ఆగుతుందా?


వీరిద్దరి మధ్య రేగిన ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా? లేక పెద్దది అవుతుందో? చూడాలి.

English summary
Rishi Kapoor, who usually enjoys pulling others legs on Twitter just for fun, ended up becoming serious about the Gandhi family and the Congress party, for naming several bridges and monuments after the Gandhi clan. This has not gone down well with Kamaal R Khan, who is notorious for thrashing celebs on Twitter with no mercy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more