‘విక్కీదాదా’తో ఆ నిర్మాత మరో ప్రయోగం..
'విక్కీదాదా" నుంచి 'రగడ" వరకు కింగ్ నాగార్జునతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కామాక్షి ఎంటర్ ప్రైజెస్ అధినేత, అగ్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి, నాగర్జున హిరోగా మరో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచి ప్రారంభంకానుంది. ఈ చిత్రం గురించి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. '' నాగార్జున గారితో కామాక్షి బేనర్ లో జనవరి నుంచి మరో భారీ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఆగస్ట్ 12న నాగచైతన్య 'దడ" చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఆగస్టు చివరి వారంలో నాగర్జున గారి చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తామని"" అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కీప్ట్ వర్క్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











