twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్, కమల్ హాసన్ కాంబినేషన్

    By Staff
    |

    హీరోలు అంటే ఎలా ఉండాలండీ...ఎలా ఉండాలి? ఒంటి చేత్తో వంద మందిన మట్టి కరిపించాలి. తల కట్టు చెదరకూడడు...ఐరన్ మడతలు నలగకూడదు..." ఆహా! అలా కాకపోతే హీరోలు కారా? "కారు... మీరు ఔనన్నా ప్రేక్షకులు ఒప్పుకోరు..." మీరు ఏ కాలంలో ఉన్నారండీ బాబూ? ఓసారి వీరిని చూడండి. ఎవరు వీరు? "కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్".

    హిందీలో రూపొంది, బాగా రన్ అయిన 'ఎ వెన్స్ డే" సినిమాను తెలుగు, తమిళంలో తీయబోతున్నారు. తెలుగులో 'ఈనాడు" టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది అరుదైన కాంబినేషన్ కాబట్టి ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మన దేశంలో వివిధ రాష్ట్రాలలో జరిగిన టెర్రరిజంను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూసొందుతోన్న చిత్రం కాబట్టి ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ మెండుగా ఉంటుందని, ఇలా సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద స్టార్స్ జంటగా నటించడంతో ఇంతకంటే ఎక్కువగా ప్రేక్షకులు ఆశించరని బాక్సాఫీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X