కమల్ దశావతారాలు
కమల్‌హాసన్ పది అవతారాలలో దర్శనమిచ్చే దశావతారం చిత్రం మొదటి నుంచి సంచలనం రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో కమల్ సరసన నటించడానికి పలువురు హీరోయిన్స్‌ని సంప్రదించినా ఎవ్వరూ ముందుకురాకపోవడంతో చివరికి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఆసిన్‌ని ఒప్పించారు. ఉత్తరాదిలో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న మల్లికా షెరావత్ దక్షిణాది వైపు చూస్తున్న తరుణంలో ఈ చిత్రంలో అవకాశం రావడంతో రెడీగా అంగీకరించింది. అయితే, ఆమె కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోందని సమాచారం.
ఈ చిత్రంలో కమల్ పది అవతారాలు ఉన్నా, ఇప్పటికి కేవలం రెండే రెండు అవతారాలు బయటకి తెలిసాయి. ఒక వేషంలో కమల్ 18వ శతాబ్దానికి చెందిన పూజారిగా కనిపించబోతున్నారు. మీసాలు లేకుండా, కళ్లజోడు పెట్టుకున్న కమల్ ఫోటోను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మిగిలిన వేషాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ చిత్రానికి దర్శకుడు కె.ఎస్. రవికుమార్. సంగీత దర్శకుడు బాలీవుడ్ సంచలనం హిమేష్ రేష్మియ అందించడం విశేషం. హిమేష్‌కు ఇదే తొలి దక్షిణాది చిత్రం. కమల్ హాసన్ ఆస్థాన రచయితలు క్రేజీ మోహన్, సుజాత ఈ చిత్రానికీ పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications