వెయ్యి ప్రింట్లతో సినిమా విడుదల???
హాలీవుడ్ లో ఒక సినిమాను 3000 ప్రింట్లతో సైతం విడుదల చేస్తారు. ఆ సినిమాల మార్కెట్ అలాంటిది. అదే మన సినిమాల విషయానికి వస్తే అంత సీన్ ఉండదు. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించి స్వయంగా నిర్మించిన చిత్రం ఓం శాంతి ఓంను 2000 ప్రింట్లతో విడుదల చేయడమే రికార్డులలోకి ఎక్కింది. ఒక భారతీయ సినిమా అత్యధిక ప్రింట్లతో విడుదలైన చిత్రంగా ఓం శాంతి ఓం సినిమా చరిత్ర సృష్టించిందన్న మాట. తాజాగా బాలీవుడ్ సినిమాలకు లాటిన్ అమెరికాలో మార్కెట్ ఏర్పడింది. అందుకే షారూక్ అన్ని ప్రింట్లతో సినిమాను విడుదల చేశాడు.
మిగతా భాషల చిత్రాల విషయానికి వస్తే పరిస్థితి మళ్లీ తారుమారు. హిందీ తరువాత అత్యధిక మార్కెట్ ఉన్న నటులు తమిళంలోనే ఉన్నారు. వీరి సినిమాలు వివిధ దేశాలలో విడుదల అవుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు జపాన్ లో విపరీత అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన నటించిన శివాజీ సినిమా మరిన్ని దేశాలలో విడుదల అయింది. ఇపుడు మరో స్టార్ భారీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కమల్ హాసన్ 10 విభిన్న పాత్రలలో కనిపించి రూపొందించిన సినిమా దశావతారం సినిమాను 1000 ప్రింట్లతో విడుదల చేయడానికి సమాయత్తమవుతున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాలో కమల్ 10 విభిన్న యాసలలో మాట్లాడనున్నాడు. కెయస్ రవికుమార్ ఇందుకోసం ఎంతో కష్టపడ్డాడట.


Click it and Unblock the Notifications











